శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (15:11 IST)

పెద్ద నోట్ల రద్దుపై భీష్ముడు ఏమంటున్నాడు..! మోడీ పారిపోతున్నారా?

పాత పెద్దనోట్ల రద్దుపై స్పందిస్తే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలా లేకుండా ఆ పార్టీ నేతలు స్పందించాలి కానీ.. ఈ భీఘ్ముడు ఏందీ స్పందించడమేంటి అనుకుంటున్నారా... భీఘ్ముడంటే పార్టీకి పెద్ద దిక్కని. ఇప్పటిక

పాత పెద్దనోట్ల రద్దుపై స్పందిస్తే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలా లేకుండా ఆ పార్టీ నేతలు స్పందించాలి కానీ.. ఈ భీఘ్ముడు ఏందీ స్పందించడమేంటి అనుకుంటున్నారా... భీఘ్ముడంటే పార్టీకి పెద్ద దిక్కని. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది బీజేపీలో ఎవరు పెద్ద దిక్కో.
 
కమలం పార్టీలో ఒక మంచి సాంప్రదాయం ఉంది. పార్టీని నమ్ముకుంటే చాలు. ఏ పని అయినా అప్పగిస్తారు. ఇంకాస్త సమర్థత ఉంటే చాలు ప్రధాని అయినా చేసేస్తారు. అందుకు నిజంగా ఆ పార్టీని అభినందించాల్సిందే. కానీ పెద్దలను గౌరవించాలన్న చిన్న పాటి సాంప్రదాయాన్ని మరిచిపోతున్నట్లున్నారు ఆ పార్టీలోని కొందరు నాయకులు. వెంకయ్య నాయుడు మొదలుకుని మోడీ వరకు తొలినాళ్ళలో పార్టీ కోసం కరపత్రాలు పంపిణీ చేసినవారే. గోడలకు పోస్టర్లు అంటించిన వారే. అది వారి భవిష్యత్తును ఇంతగా తీర్చిదిద్దుతుందని అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చు.
 
వస్తువు రాను రాను ఉపయోగరకం కాకపోతే పక్కన పడేస్తాం. కానీ రాజకీయాల్లో వేలు పెట్టి నడిపించిన వాడిని పాఠాలు చెప్పి ప్రయోజకుడిని చేసిన వారిని పక్కన పెట్టడం ఎవరికైనా బాధ కలిగించే విషయం. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నారబ్బా అనుకుంటున్నారా.. దేశమంతా నోట్ల రద్దుపై ఇంత హడావిడిగా ఉంటే తన శిష్యుడు తీసుకున్న నిర్ణయాన్ని ఆ గురువు ఏ విధంగా చూస్తున్నాడో తెలియడం లేదు. ఆ గురువు ఎవరో కాదు కమల దళపతి అద్వానీ. ఇక శిష్యుడు ఎవరో మీకే అర్థమైందిగా.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మోడీ పార్టీలో కూడా చెప్పకుండానే తీశాడన్న ప్రచారం కూడా జరుగుతోంది.
 
అయితే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడైనా ఈ విషయంలో మోడీ పార్టీ పెద్ద అభిప్రాయాలు తీసుకుంటున్నాడా అన్న ప్రశ్న వినిపిస్తుంది. రాజకీయంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దగా అనుభవం అవసరం లేకున్నా దానిని అమలు చేయడంలో ఖచ్చితంగా కావాలి. మోడీలో ఉన్న ఆ అనుభవ రాహిత్యమే ఇప్పుడు జనాన్ని బ్యాంకుల ముందు నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఆర్బీఐ అధికారులనే నమ్ముకుని ముందు కెళ్ళిన మోడీకి కూడా తప్పు చేశానన్న ఫీలింగ్‌ కలిగి ఉండవచ్చు. అందుకే ఛలోక్తులతో గంటల తరబడి ప్రసంగాలు చేసే మోడీ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేక పార్లమెంట్‌కు రాలేకపోయాడు. అందుకే బీజేపీపిలోనే మోడీకి వ్యతిరేకత పెరుగుతోంది అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఈ సమయంలో అయినా పార్టీలో ఉండే పెద్దలను మోడీ మర్యాద పూర్వకంగా కలిస్తే మంచిదనిపిస్తోంది.