కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుపై ధ్వజమెత్తారు. తాము తెలంగాణను 29వ రాష్ట్రంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ప్రకటించామనీ, తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఏర్పాటవుతుందని ప్రకటించారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కలను సాకారం చేశామనీ, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా మహిళను చూడాలనుకుంటున్నట్లు ప్రకటించారు.కాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు తెరాసను ఇటు తెదేపాను ఒకేసారి తన ప్రకటనతో కొట్టేశారు.