ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన తనయుడు రాహుల్ గాంధీతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సోనియాగాంధీ కాంగ్రెస్ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అట్టహాసంగా నామినేషన్ సమర్పించారు.