తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్
పవిత్రమైన అక్షయ తృతీయ పండుగ సమీపిస్తున్న తరుణంలో, టాటా సంస్థకు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్, సహజ రత్నాల విభాగంలో తమ తాజా ఆభరణాలను రుక్మిణి వసంత్‌తో కలిసి ఆవిష్కరించింది. దక్షిణ భారతదేశంలో ఎల్లప్పుడూ రత్నాలు, కేవలం అలంకరణకు మించినవి; అవి సంప్రదాయం, గుర్తింపు మరియు నిత్యజీవితపు సొగసుకు ప్రతీకలు. టెంపుల్ జ్యువెలరీ ప్రభావం నుండి ఉత్సాహభరితమైన వేడుకల వరకూ, ఈ ప్రాంతపు సౌందర్య భాషలో లోతుగా రత్నాలు పెనవేసుకుపోయాయి. కెంపులు, పచ్చలు, ఇతర ప్రకాశవంతమైన రాళ్ల వైభవాన్ని ఒక ప్రధాన భాగంగా దక్షిణాది స్వీకరించింది. దక్షిణ భారతదేశంలో తనిష్క్ యొక్క కొత్త ముఖ చిత్రంగా రుక్మిణి వసంత్ ఆధునిక దక్షిణ భారత ఆభరణాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు. సహజసిద్ధమైన సొగసు, ఉల్లాసకరమైన ఆధునికతతో హ్యూస్ స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. వ్యక్తిత్వం, శాశ్వతమైన సౌందర్యం కలిసే తాజా కలెక్షన్ ఇది.
ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని అనుభవించే విధానాన్ని హ్యూస్ కలెక్షన్ సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. ఇది సాంప్రదాయ, పెట్టుబడి-ఆధారిత కొనుగోళ్లకు అతీతంగా, భావవ్యక్తీకరణకు, ధరించడానికి ఉద్దేశించిన ఆభరణాల వైపు తీసుకువెళ్తుంది. విలక్షణమైనప్పటికీ, సరసమైన ఫైన్ జ్యువెలరీని కోరుకునే వారి కోసం రూపొందించబడిన కొత్త హ్యూస్ కలెక్షన్, బంగారంలో సమకాలీన రంగుల కథలను చాటిచెప్పే ఒక ప్రత్యేకమైన డిజైన్ శైలితో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 35,000. శిల్ప రూపాలు, ప్రకాశవంతమైన రత్నాలు, ప్రతి రంగులోని లోతును వెల్లడి చేసే కచ్చితమైన కోతలను ఇది ఒకచోట చేర్చింది. ప్రతి ఆభరణం రంగును తన కేంద్రంగా చేసుకుంది. తమ మానసిక స్థితి, శైలి, స్ఫూర్తికి ప్రతిబింబంగా ఆభరణాలను స్వీకరించే మహిళ కోసం ఇది రూపొందించబడింది. సహజ రంగుల రత్నాలపై దృష్టి సారించడంతో, ఈ ప్రాంతం ఇప్పటికే విలువనిచ్చే విభాగంలో తనిష్క్ తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. ఇది సమకాలీన డిజైన్‌ను శాశ్వతమైన అభిరుచితో జత చేస్తుంది.
మృదువైన, కాబోచాన్-కట్ రాళ్ల వాడకం ఒక శిల్పకళాత్మకమైన, కాంతివంతమైన రూపాన్ని అందిస్తుంది. అదేసమయంలో, పొరలుగా ఉండే రంగుల కూర్పులు, బంచింగ్, స్లైసింగ్ వంటి పద్ధతులు లోతును, ఆకృతిని, కదలిక భావనను జోడిస్తాయి. ఫలితంగా, ఈ ఆభరణాలు చైతన్యవంతంగా, విలక్షణంగా ఆధునికంగా కనిపిస్తాయి. పచ్చలు, నీలమణి, సిట్రిన్‌లు, టూర్మలైన్‌లు, టాంజనైట్‌లు వంటి సహజ రంగుల రత్నాలను జాగ్రత్తగా ఎంపిక చేసి, ప్రతి రాయిని దాని అద్భుతమైన రంగు, స్పష్టత, సహజ లక్షణాల కోసం నైపుణ్యంతో, కఠినమైన నాణ్యతా ప్రమాణాల ద్వారా ఎంపిక చేశారు. ఇది ఈ కలెక్షన్‌కు అరుదైన, ప్రామాణికమైన గుర్తింపును ఇస్తుంది. అదే సమయంలో ప్రతిరోజూ ధరించడానికి తగిన అందం, మన్నిక రెండింటినీ అందిస్తుంది. ఈ శ్రేణిలో ప్రత్యేక సందర్భాల కోసం స్టేట్‌మెంట్ నెక్ పీస్‌లు-గాజులతో పాటు, రోజువారీ సొగసు కోసం రూపొందించిన తేలికపాటి చెవిరింగులు, ఉంగరాలు, పెండెంట్ సెట్‌లు ఉన్నాయి. ఇది బంగారం యొక్క శాశ్వత విలువను సమకాలీన డిజైన్ యొక్క ఉత్సాహంతో సమతుల్యం చేసే వైవిధ్యమైన వార్డ్‌రోబ్‌ను అందిస్తుంది.
ఈ కథనానికి కేంద్రబిందువు రుక్మిణి వసంత్. ఆమెను ఈ ప్రచారానికి ముఖచిత్రంగా, సమకాలీన దక్షిణ భారత మహిళకు ప్రతీకగా పరిచయం చేశారు. తనిష్క్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యానికి నాంది పలుకుతూ, ఆమె అనుబంధం ఒక సీజన్‌కు మాత్రమే పరిమితం కాని ఒక ఉమ్మడి దృక్పథాన్ని సూచిస్తుంది. చూడగానే ఆకట్టుకునే సొగసు, ఉల్లాసకరమైన ఆధునికతతో, వ్యక్తిత్వం, శాశ్వతమైన సౌందర్యం కలిసే హ్యూస్ స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలుస్తారు. అద్భుతమైన చిత్రాల శ్రేణి ద్వారా జీవం పోసుకున్న ఈ ప్రచారం, బలం, సున్నితత్వం రెండింటినీ చాటిచెప్పే క్షణాలలో రుక్మిణిని చిత్రీకరిస్తుంది. ప్రతి ఆభరణం యొక్క జీవకళను, శిల్ప సౌందర్యాన్ని వెల్లడించేలా రూపొందించిన ఈ దృశ్యాలు, రంగు, ఆకారం, భావోద్వేగాల మధ్య ఒక సహజమైన కలయికను సృష్టిస్తాయి. ఆమె ఉనికి, ఈ ప్రచారానికి ఒక శక్తివంతమైన ప్రాంతీయ ప్రతిధ్వనిని అందిస్తుంది. ఇది సాంస్కృతిక ప్రామాణికతపై ఆధారపడి ఉన్నప్పటికీ, దాని వ్యక్తీకరణలో భవిష్యత్ దృష్టిని కలిగి ఉంటుంది. ఆమె ద్వారా, హ్యూస్ కేవలం ఒక కలెక్షన్ కంటే ఉన్నతంగా నిలుస్తుంది; అది మూలాలతో నిండిన, ప్రకాశవంతమైన, నిర్మొహమాటంగా తన భావాలను వ్యక్తపరిచే ఆధునిక భారతీయ మహిళ యొక్క వికసిస్తున్న గుర్తింపుకు ప్రతిబింబంగా నిలుస్తుంది.
కొత్త కలెక్షన్ గురించి టైటాన్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీమతి పెల్కి షెరింగ్ మాట్లాడుతూ, దక్షిణాది యొక్క గొప్ప సౌందర్య వారసత్వంలో లోతుగా పాతుకుపోయినప్పటికీ, అదే సమయంలో స్పష్టంగా సమకాలీనంగా ఉండే ఒక దృక్కోణం ద్వారా, ఆధునిక భారతీయ మహిళ సహజ రత్నాలతో ఎలా మమేకమవుతుందో తాము పునఃసృష్టిస్తున్నాము. ఆభరణాలు వ్యక్తిగత గుర్తింపుకు ఒక విస్తరణగా మారుతున్న ఈ తరుణంలో, రత్నాలు తమ గాఢమైన రంగు, ప్రత్యేకతతో, ఒక సహజమైన, భావవ్యక్తీకరణ మాధ్యమాన్ని అందిస్తున్నాయి. ఎథ్నో-కంటెంపరరీ భావనతో రూపొందించబడిన తమ మొదటి కలెక్షన్, భారతీయ వేసవి యొక్క ఫ్లూయిడిటీ, ఉత్సాహం నుండి ప్రేరణ పొందింది. ఇది రంగులను గాఢమైన, సున్నితమైన రూపాల్లో తీసుకువస్తుంది. నేటితరం మహిళ ఆభరణాలను ధరించే తీరు- ఎంతో సహజంగా, సౌకర్యవంతంగా, తన సొంత అభిరుచికి అనుగుణంగా- ఉండటాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. తాము ఎవరి కోసం డిజైన్ చేసామో ఆ మహిళలాగే, రుక్మిణి కూడా తనదైన ప్రత్యేక శైలితో, ఒదిగి ఉంటూనే, ఈ స్ఫూర్తికి సునాయాసమైన ఆధునికతతో జీవం పోస్తుంది అని అన్నారు.
టైటాన్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ శ్రీమతి గరిమా మహేశ్వరి మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో రంగుల రత్నాల ఆభరణాల రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, డిజైన్‌కు ప్రాధాన్యతనిచ్చే అన్వేషణలలో ఒకటిగా నిలిచేలా హ్యూస్ కలెక్షన్‌ను రూపొందించాలని తాము లక్ష్యంగా పెట్టాము. ఈ కలెక్షన్ భారతీయ వేసవి కాలపు వైభవం నుండి, అంటే దాని పచ్చని ప్రకృతి దృశ్యాలు, ప్రకాశవంతమైన రంగుల నుండి లోతుగా ప్రేరణ పొందింది. శిల్పకళాత్మకమైన ఆకృతులు, ప్రవాహవంతమైన కూర్పుల ద్వారా వీటిని ఆభరణాలుగా అనువదిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం, రంగుల రత్నాలను ఒక డిజైన్-ఆధారిత విభాగంగా పరిగణించడం.
ఇక్కడ రత్నం కేవలం అలంకరణ వస్తువుగా కాకుండా, డిజైన్‌కే ప్రారంభ బిందువుగా ఉంటుంది. ప్రతి ఆభరణంలోనూ రంగు, నిష్పత్తి, సమగ్ర సామరస్యంలో కచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు, రత్నాల క్రమాంకనం, ప్రత్యేకమైన కోతల రూపకల్పనకు సంబంధించిన ఒక క్షుణ్ణమైన ప్రక్రియ దీనికి అవసరమైంది. కాబోచాన్ కట్‌ల వాడకం ఈ విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇది రాళ్ల సహజ సౌందర్యాన్ని, కోణాలను వెలికితీసే సున్నితమైన, శిల్పకళాత్మకమైన లోతును అందిస్తుంది. దీని ఫలితంగా, ఆధునిక భారతీయ డిజైన్‌పై ఒక బలమైన దృక్పథంతో రూపొందించబడిన, భావవ్యక్తీకరణతో కూడిన, సమకాలీనమైన కలెక్షన్ ఆవిష్కృతమైంది అని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి రుక్మిణి వసంత్ మాట్లాడుతూ, తనకు తెలిసినప్పటి నుంచీ తనిష్క్ తన జీవితంలో ఒక భాగంగా ఉంది; నమ్మకం, పనితనం, శాశ్వత సౌందర్యంతో తాను ఎల్లప్పుడూ ముడిపెట్టే పేరు అది. ఇప్పుడు హ్యూస్ ప్రచారానికి ముఖచిత్రంగా వారితో కలిసి పనిచేయడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఈ కలెక్షన్‌లో తనకు నచ్చిన విషయం ఏమిటంటే, ఇది సొగసును నిలుపుకుంటూనే రంగుల ద్వారా వ్యక్తిత్వాన్ని చాటిచెబుతుంది. సౌందర్యానికి సంబంధించిన విభిన్న వ్యక్తీకరణలను ఇంత అద్భుతంగా మేళవింపజేసే ప్రచారంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు.
రూ. 35,000 నుండి ప్రారంభమయ్యే ఈ కలెక్షన్ ప్రత్యేక సందర్భాలకు మరియు రోజువారీ వాడకానికి అనువుగా రూపొందించిన వైవిధ్యమైన శ్రేణిని అందిస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా, తనిష్క్ ప్రత్యేక పండుగ ఆఫర్లను అందిస్తోంది. వీటిలో మేకింగ్ ఛార్జీలపై 20% వరకు తగ్గింపు మరియు బంగారు ఆభరణాల కొనుగోళ్లపై ప్రతి గ్రాముకు ఫ్లాట్‌గా రూ. 201 తగ్గింపు వంటివి ఉన్నాయి. వినియోగదారులు ఫెస్టివల్ అఫ్ ఎక్స్చేంజ్ నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు, పాత బంగారాన్ని, అర్థవంతమైన, ధరించడానికి వీలైన ఆభరణాలుగా మార్చుకోవడానికి ఇది ఒక అత్యుత్తమ సమయం.
