శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (13:37 IST)

క్యారెట్‌ పూరీని టేస్టు చేశారా?

క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. దృష్టి సమస్యలు పోతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని వైద్యులు చెప్తున్నారు.  క్యారెట్ జ్యూస్‌ను రోజూ తాగితే హైబీపీ తగ్గుతుంది. రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది. 
 
ఇంకా రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాంటి క్యారెట్‌ను పిల్లలు తినడానికి మారాం చేస్తే.. వారికి ఇష్టమైన ఆహార పదార్థాల్లో చేర్చి ఇవ్వడం చేయాలి. అలాంటి వంటకాల్లో ఒకటే క్యారెట్ పూరీ. సాధారణంగా పూరీలంటే ఇష్టం. ఆ పూరీల్లో క్యారెట్‌ను కలిపితే పోషకాలు కూడా అందుతాయి. అలాంటి వంటకం.. క్యారెట్ పూరీని ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి - కప్పు, 
క్యారెట్ రసం - పావుకప్పు.
బొంబాయి రవ్వ - రెండు చెంచాలు,  
నూనె - వేయించడానికి సరిపడా,
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం: ముందుగా వెడల్పాటి బౌల్‌లో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు తీసుకోవాలి. క్యారెట్ రసం, నీళ్లు పోస్తూ చపాతీపిండిలా కలపాలి. పావుగంట తరువాత పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పిండిని పూరీల్లా ఒత్తుకుని రెండేసి చొప్పున నూనెలో వేయించుకుని తీసుకుంటే చాలు. అంతే క్యారెట్ పూరీ రెడీ అయినట్లే. ఈ పూరీల్లో ఆలు గ్రేవీతో పిల్లలకు వడ్డిస్తే ఇష్టపడి తింటారు.