'స్నేహం ఎంతో మధురమైనది. స్నేహానికి లింగ, వయో భేదాలు లేవు. ఎన్ని తరాలు మారినా మారనిది స్నేహమే. నేటి తరం యువత రక్తసంబంధం కన్నా స్నేహానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. స్నేహానికి ఎల్లలు లేవన్నది నిజం అంటున్నది నేటి తరం. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అన్నారో కవి. నిజమే సృష్టిలో కొన్నిటికి విలువ కట్టలేము. వాటిలో తల్లి ప్రేమ, స్నేహానికి అగ్రస్థానం.