గేట్ వే ఆఫ్ ఇండియా ముంబయి నగరంలోని అపోలోబందర్ ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉంది. దీని ఎత్తు 85 మీటర్లు. ఇదో స్మారక కట్టడం. సముద్రం ద్వారా వచ్చే అతిథులకు ఇదో స్వాగత ద్వారం. బోట్ల ద్వారా ముంబై వచ్చే సందర్శకులకు ముందుగా కనిపించేది కూడా ఇదే. భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి 21 లక్షల రూపాయలను ఖర్చు చేశారు...