1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
  4. In diabetic nephropathy, the kidneys will be damaged, What are the symptoms of this disease?

కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు

Kidneys
మధుమేహం వ్యాధి కారణంగా కిడ్నీలు దెబ్బతినే స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం పాటు నియంత్రణలో లేనప్పుడు, అవి కిడ్నీలోని వడపోత వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ స్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు.
 
డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా వుంటాయో తెలుసుకుందాము. ప్రారంభ దశలో ఈ వ్యాధి లక్షణాలు బయటికి కనిపించవు. వ్యాధి ముదిరే కొద్దీ ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాళ్ళు, పాదాలు, చీలమండలు లేదా చేతుల్లో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. మూత్రంలో నురుగు రావడం... అంటే ప్రోటీన్ పోవడం వల్ల అలా నురుగు వస్తుంది. తరచుగా మూత్ర విసర్జన... ముఖ్యంగా రాత్రిపూట చేయాల్సి వస్తుంది.
 
త్వరగా అలసిపోవడం, శారీరక బలహీనత మరియు ఏకాగ్రత తగ్గడం. ఆకలి తగ్గడం, వికారం, వాంతులు వుంటాయి. హై బీపీ నియంత్రణలోకి రాకపోవడం. చర్మంపై నిరంతరంగా దురద రావడం. కిడ్నీల పనితీరు తగ్గడం వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
 
డయాబెటిక్ నెఫ్రోపతి చికిత్స మార్గాలు కూడా వున్నాయి. వ్యాధి ముదరకుండా ఆపడం, కిడ్నీల పనితీరును కాపాడటం. రక్తంలో చక్కెర స్థాయిలను కచ్చితమైన పరిమితిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బీపీ నియంత్రణలో వుంచుకోవాలి. ఉప్పు తగ్గించాలి. ప్రోటీన్ మరియు పొటాషియం తీసుకోవడంపై వైద్యుని సలహా పాటించాలి. కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్స్, మూత్రంలో ప్రోటీన్ పోకుండా చేసే మందులు వాడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువు తగ్గడం, ధూమపానం మానేయాలి. తీవ్ర దశలో కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటే డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం అవుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి,.
తర్వాతి కథనం
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి