వాలెంటైన్స్ డే అంటే ఇప్పుడు కేవలం ఆర్భాటంగా జరుపుకోవడం లేదా ఒక రోజు మాత్రమే ఆనందించడం కాదు. నేడు, బహుమతులు ఇవ్వడం అనేది మరింత వ్యక్తిగతంగా, ఆలోచనాత్మకంగా, రోజువారీ శ్రద్ధను ప్రతిబింబించేలా మారుతోంది. కేవలం రొమాంటిక్ భాగస్వాములనే కాకుండా... స్నేహితులు, కుటుంబ సభ్యులు, తమను తాము కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు అర్థవంతమైన, ఉపయోగకరమైన బహుమతుల కోసం చూస్తున్నారు. ఈ మార్పు... చాక్లెట్లు, పూల కంటే భిన్నమైన, ఆధునిక ప్రత్యామ్నాయాలకు తలుపులు తెరుస్తోంది.
ఈ క్రమంలో కాలిఫోర్నియా బాదం ఒక ఆలోచనాత్మక బహుమతి ఎంపికగా ఆవిర్భవించింది. అద్భుతమైన రుచికి తోడు రోజువారీ పోషణను ఇవి అందిస్తాయి. ఇవి మన దైనందిన జీవితంలో సహజంగా ఇమిడిపోతాయి. వాలెంటైన్స్ డే పూర్తయిన చాలా కాలం తర్వాత కూడా ఉపయోగపడే ఒక మంచి బహుమతిగా నిలుస్తాయి.
ప్రతి ఉదయం శ్రద్ధను చాటే బహుమతి
చిన్నచిన్న, స్థిరమైన అలవాట్లు తరచుగా పెద్ద మార్పును తీసుకువస్తాయి. ఉదయం సమయం ముందున్న రోజంతటికీ పునాది వేస్తుంది. ఉదయం దినచర్యలో కాలిఫోర్నియా బాదంపప్పులను చేర్చుకోవడం అనేది.. పోషణ పొందేందుకు, ఉల్లాసంగా ఉండేందుకు ఒక సులభమైన మార్గం. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదంపప్పులు, మనకు సులభంగా రోజువారీ ఆరోగ్యాన్ని అందిస్తాయి.
న్యూఢిల్లీలోని మ్యాక్స్ హెల్త్‌కేర్ డైటెటిక్స్ రీజినల్ హెడ్ రితికా సమద్దర్ మాట్లాడుతూ, కాలిఫోర్నియా బాదంలో ఉండే ప్రోటీన్, డైటరీ ఫైబర్ కారణంగా, ప్రతిరోజూ ఉదయం వీటితో దినచర్యను ప్రారంభించమని నేను తరచుగా సిఫార్సు చేస్తాను. ముఖ్యంగా ఉదయం పూట వీటిని క్రమంతప్పకుండా తీసుకున్నప్పుడు, రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగ్గా ఉండేలా బాదం మద్దతు ఇస్తుంది. ఫాస్టింగ్ ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అలాగే వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది కాబట్టి బరువు నిర్వహణకు కూడా దోహదం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతు ఇచ్చే ఒక సులభమైన అలవాటు అని అన్నారు.
న్యూట్రిషన్ మరియు వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి జతచేస్తూ, నేటి రోజుల్లో శ్రేయస్సుకు మద్దతు ఇచ్చేదే అత్యుత్తమ ఆలోచనాత్మక బహుమతి. బాదంపప్పులు కచ్చితంగా అలాంటివే. ఇవి సహజంగానే పోషకాలతో నిండి ఉంటాయి. సౌకర్యవంతంగా ఉంటాయి, మన రోజువారీ దినచర్యలో, ముఖ్యంగా ఉదయం అలవాటుగా సులభంగా చేర్చుకోవచ్చు. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణ, చర్మ ఆరోగ్యానికి మద్దతు లభిస్తుంది. ఇది అత్యంత ఆచరణాత్మకమైన మార్గంలో శ్రద్ధను ప్రతిబింబించే బహుమతి అని పేర్కొన్నారు.
ప్రేమకు ఆధునిక వ్యక్తీకరణ - రుచి, నిగారింపు మరియు శ్రేయస్సు
పోషకాహారంతో పాటు, యువ వినియోగదారులు బహుమతులను స్వీయ-సంరక్షణ, అందంతో ఎక్కువగా ముడిపెడుతున్నారు. దీంతో వేడుకల సమయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎంపికలకు ప్రాధాన్యత పెరుగుతోంది.
బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, వివిధ రకాల కాలిఫోర్నియా బాదంపప్పులతో కూడిన బాక్స్... వాలెంటైన్స్ డేకి అద్భుతమైన బహుమతిగా మారుతుంది. ఈ సహజమైన, పోషకాలతో కూడిన గింజలు చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతో సహా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ(ఆల్ఫా-టోకోఫెరోల్) పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను అడ్డుకునే లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. నిజానికి, బాదంపప్పులను క్రమం తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మ ఆకృతి మెరుగుపడుతుంది. అలాగే, యూవీబీ (UVB) కాంతిని తట్టుకునే చర్మ సామర్థ్యానికి మద్దతు ఇస్తుంది అని వివరించారు.
బహుమతులు ఇవ్వడం నుండి రోజువారీ అలవాట్ల వరకు...
బహుముఖ ప్రయోజనాలు మరియు అన్ని సందర్భాలలో ఆస్వాదించగలిగే సామర్థ్యంతో... కాలిఫోర్నియా బాదం అనేది బహుమతులు ఇచ్చే విధానంలో వస్తున్న మార్పును సూచిస్తోంది. ఇది ఒకరోజు ఆనందం నుండి రోజువారీ శ్రేయస్సు వైపు మారుతున్న ట్రెండ్‌ను ప్రతిబింబిస్తోంది. ప్రీమియం బాక్సులలో బహుమతిగా ఇచ్చినా, అల్పాహారంలో చేర్చుకున్నా లేదా ఇంట్లో ఉదయం పూట సరళమైన దినచర్యగా పంచుకున్నా... ప్రేమను వ్యక్తీకరించడానికి బాదం ఒక ఆధునిక, అర్థవంతమైన మార్గాన్ని ప్రతిబింబిస్తుంది.
కాలిఫోర్నియా బాదంపప్పులు సహజమైన, ఆరోగ్యకరమైన మరియు నాణ్యమైన ఆహారం. కాలిఫోర్నియాలోని 7,600 మందికి పైగా బాదం రైతులు మరియు ప్రాసెసర్‌ల తరఫున 'కాలిఫోర్నియా బాదం బోర్డ్' పనిచేస్తుంది. వీరిలో చాలా వరకు తరతరాలుగా వస్తున్న కుటుంబ వ్యాపారాలే ఉన్నాయి. ఈ బోర్డు తన పరిశోధన ఆధారిత విధానం ద్వారా మార్కెటింగ్, వ్యవసాయం మరియు ఉత్పత్తికి సంబంధించిన అన్ని విభాగాల్లో బాదంపప్పులను విస్తృతంగా ప్రోత్సహిస్తుంది. 1950లో స్థాపితమై, కాలిఫోర్నియాలోని 'మోడెస్టో' కేంద్రంగా పనిచేస్తున్న ఈ బాదం బోర్డ్ ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది 'యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్' పర్యవేక్షణలో... రైతులు రూపొందించిన ఫెడరల్ మార్కెటింగ్ ఆర్డర్‌ను నిర్వహిస్తుంది.