శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (15:38 IST)

ఏ రంగు పండుతో ఎలాంటి ప్రయోజనమో తెలుసా?

రోజువారీ మనం తీసుకుంటున్న ఆహారంలో పలురకాల రంగులుంటాయి. ఈ రంగుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు లాభాలు చేకూరుతాయని పరిశోధకులు తెలిపారు. 
 
తెలుపు రంగు
బంగాళా దుంప, వెల్లుల్లి(తెల్లగడ్డ), తెల్లటి పుట్టగొడుగులు మొదలైన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కాలేయానికి బలం చేకూరుతుంది. 
 
ఆరెంజ్
ప్లీహాన్ని అదుపు చేసేందుకు ఆరెంజ్ రంగులోనున్న ఆహార పదార్థాలు తీసుకోవాల్సివుంటుందని పరిశోధకులు తెలిపారు. కమలాపండ్లలో విటమిన్ సీ ఉంటుంది. విటమిన్ బి తక్కువ పాళ్ళలో వుంటుంది. ఇది ప్లీహాన్ని అదుపుచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఆకుపచ్చ (గ్రీన్) 
ఆకుపచ్చ రంగులోనున్న పండ్లు, కూరగాయలలో లూటీన్, ఇండోల్ అనే పేరుగలిగిన ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇది మూత్రపిండాలను రక్షిస్తుంది. కాబట్టి మూత్రపిండాలు బలంగా ఉండాలంటే ఆకుపచ్చ రంగులోనున్న ఆహార పదార్థాలు సేవించండి.
 
లేత ఎరుపురంగు(ఊదా)
మెదడు (బ్రెయిన్) పటిష్టంగా ఉండాలంటే ఊదా రంగులోనున్న పండ్లు, కూరగాయలు మీ ఆహరంలో ఉండేలా చూసుకోండి. ఇందులో ద్రాక్ష పండ్లు, ఉల్లిపాయలు, నేరేడు పండ్లు, వంకాయలు తదితరాలున్నాయి
 
నలుపు (బ్లాక్)
నలుపు రంగు అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఆహార పదార్థాలలోనైతే అస్సలు తీసుకోరు. నలుపు రంగు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే మూత్రపిండాలకు రక్షణ కలిగిస్తాయి. కాబట్టి నల్ల నువ్వులు, ఎండు ద్రాక్ష, తదితర పదార్థాలను సేవించండి. 
 
ఎరుపు (రెడ్)
గుండెకు బలం చేకూర్చాలనుకుంటే ఎరుపు రంగులోనున్న ఆహార పదార్థాలను సేవించండి. ఎరుపు రంగులోనున్న పండ్లు, కూరగాయలలో ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయ, టమోటా మొదలైన ఎరుపు పండ్లను తీసుకోవడంతో ఇందులోనున్న ఫైటోకెమికల్స్ గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. అలాగే స్ట్రాబెర్రీ, రసబెర్రీ, బీట్‌రూట్‌లలో ఎంథోసాయనిన్ ఉంటుంది. ఇది కూడా ఫైటోకెమికల్స్‌లో ఓ భాగమే. దీనిని తీసుకోవడం వలన అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే మధుమేహానికి సంబంధించిన సమస్యను అదుపులో ఉంచుంతుందంటున్నారు పరిశోధకులు.