భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తే.. దాంపత్యం పండుతుందట!

Last Updated: శనివారం, 9 ఫిబ్రవరి 2019 (13:06 IST)
మద్యం సేవించడం ద్వారా కుటుంబాల్లో గొడవలు వంటివి జరుగుతాయనే వినివుంటాం. కానీ భార్యాభర్తలు కలిసి మద్యం సేవిస్తే.. అన్యోన్యంగా వుంటారట. అవును మీరు చదువుతున్నది నిజమే. మద్యం సేవిస్తే.. ఆరోగ్యానికి చేటు అని వినేవుంటాం. కానీ భార్యాభర్తలిద్దరూ కలిసి మద్యం సేవించే అలవాటుంటే.. వారి దాంపత్యం పండుతుందని.. వారు అన్యోన్యంగా వుంటారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. 
 
భార్యాభర్తల సంబంధాలపై జరిపిన ఓ అధ్యయనంలో.. కలిసి మద్యం సేవించే భార్యాభర్తలు సన్నిహితంగా, అన్యోన్యంగా వుంటారని.. వారిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతకు లోటుండదని తాజా అధ్యయనం తేల్చింది. ఇది వినేందుకు కాస్త వినోదంగా వున్నా.. అదే పనిగా కాకుండా వారానికో లేదా మాసానికి ఓసారి కలిసి మద్యం సేవించే భార్యాభర్తలిద్దరూ జీవితంతాం కలిసే వుంటారని తేలింది. 
 
కానీ అతిగా మద్యం సేవించే దంపతుల మధ్య మాత్రం జగడానికి లోటుండదని అదే అధ్యయనంలో తేల్చారు పరిశోధకులు. దీనిని బట్టి మనం తెలుసుకునే విషయం ఏమిటంటే.. భార్యాభర్తలు విదేశాల్లో మహిళలు, పురుషులు మద్యం సేవించడం చేస్తుంటారు. అదే మన దేశంలో మాత్రం మహిళలు మద్యం అంటే ఆమడ దూరం పారిపోతారు. 
 
అందుకే మన దేశంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కానీ తాజా అధ్యయనంలో భార్యాభర్తలు మితంగా మద్యం సేవిస్తే తప్పులేదు కానీ.. అతిగా తీసుకుంటే మాత్రం ఇబ్బందేనని తేలింది. 
 
ఇంకా మద్యాన్ని భార్యాభర్తలు ఇద్దరూ ముట్టుకోకపోతే.. కొత్త ఉత్సాహం లభిస్తుందని.. ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా వుండదని.. భావితరాల కోసం మద్యపాన సేవనాన్ని పూర్తిగా విస్మరిస్తే ఇంకా మంచిదని వెల్లడి అయ్యంది.దీనిపై మరింత చదవండి :