సంబంధిత వార్తలు
- తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..
- రోడ్డు పక్కన అమ్మే జ్యూస్‌లను తాగుతున్నారా? ఐస్‌తో జాగ్రత్త
- సమ్మర్ కాటన్ కలెక్షన్‌ను విడుదల చేసిన మిస్సమ్మ
- సమ్మర్ జర్నీలు చేసే ప్రయాణికుల కోసం Vi అదిరిపోయే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్
- చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్
మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణాల్లో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లివచ్చి చల్లటి నీటిని సేవిస్తుంటారు. ఇలా తాగడం వల్ల కొద్దిసేపు ఉపశమనం కలుగినట్టు కనిపిస్తుంది. కానీ, కొన్నిసార్లు దానివల్ల శరీరానికి తీవ్ర అసౌకర్యం కలగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా, అంతర్గత ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి శరీరం చాలా కష్టపడుతుంది. బయట వేడి తీవ్రంగా ఉన్నప్పుడు అది శీతల మోడ్‌లోకి మారిపోతుంది. ఫలితంగా స్వేద గ్రంథులు క్రియాశీలమవుతాయి. రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. వేడిని విడుదల చేయడానికి చర్మానికి చేరువలో రక్త ప్రవాహం పెరుగుతుంది. చెమట పెరుగుతుంది. తనను తాను చల్లబరచుకునే క్రమంలో శరీరం వేగంగా ద్రవాలను కోల్పోతుంది. ఈ ప్రక్రియ వల్ల డీహైడ్రేషన్‌కు గురికావడం, అలసిపోవడం జరుగుతుంది.
ఎండలో తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లగా ఉన్న నీరు తాగితే తాత్కాలికంగా రక్తనాళాలు ముడుచుకుపోతాయి. మైగ్రేన్, సైనస్ వంటి ఇబ్బందులు ఉన్నవారిపై ప్రభావం పడొచ్చు.
ఉదర భాగంలో కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. దీనివల్ల కొద్దిసేపు జీర్ణక్రియ మందగించొచ్చు.
చల్లటినీరు వల్ల గొంతు లైనింగ్‌లో అసౌకర్యం తలెత్తవచ్చు. కొందరిలో గొంతు నొప్పితోపాటు తెమడ ఎక్కువగా ఉత్పత్తి కావొచ్చు.
కొందరిలో అకస్మాత్తుగా తలనొప్పి ఉత్పన్నం కావొచ్చు. దీన్ని బ్రెయిన్ ఫ్రీజ్ అంటారు.
ఎండ తీవ్రతకు శరీరం ఒత్తిడిలో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చల్లటి నీరు తాగడం వల్ల శరీరం షాక్‌కు లోనుకావొచ్చు. ఇది కొద్దిసేపు అసౌకర్యానికి దారితీయవచ్చు.
ఉష్ణోగ్రతల్లో మార్పులతో తీవ్రంగా ఇబ్బందికి గురయ్యే సమస్య ఉన్నవారిలో గుండె కొట్టుకునే రేటుపై తాత్కాలికంగా ప్రభావం పడొచ్చు. కళ్లు తిరిగినట్లు కూడా అనిపిస్తుంది.
