సంబంధిత వార్తలు
- హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త
- భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)
- భర్తకున్న అక్రమ సంబంధం తెగిపోవాలి.. ఎల్లమ్మ ఆలయంలో భార్య పూజలు (video)
- నారా రోహిత్, సిరి దంపతులకు మగబిడ్డ పుట్టాడోచ్
- ఈ ఫోటోకి నువ్వక్కర్లేదు, పక్కకెళ్లు అంటూ శ్రీలీలకు వేలు చూపిస్తూ షాకిచ్చిన సీఎం భార్య, వీడియో
నా భార్య గర్భిణీ, ఆమెకి పొటాటో చిప్స్ తినాలని వుందట, తినవచ్చా?
గర్భిణీలు తీసుకునే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. గర్భిణీ స్త్రీలు ఏమేమి తినాలన్నది గైనకాలజి వైద్యులు చెబుతారు. ఐతే గర్భిణీలు పొటాటో చిప్స్‌ను కొద్ది మొత్తంలో తినవచ్చు. దీనివల్ల తక్షణమే ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకుండా తినాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒకటి రెండు చిన్న ముక్కలు రుచి కోసం తినడం మంచిది. దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాము.
పొటాటో చిప్స్ తయారీలో చాలామంది ఇంగువ వాడుతారు. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇంగువ తీసుకోవడం సురక్షితం కాదు. ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంది. ఐతే, పొటాటో చిప్స్ పైన లేదా మనం రోజూ వండుకునే వంటల్లో వాడే చాలా తక్కువ పరిమాణంలో ఉండే ఇంగువ వల్ల ఎలాంటి ముప్పూ ఉండదు.
పొటాటో చిప్స్ తయారీ విధానం వల్ల గర్భిణీలకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. అధిక ఉప్పు వాడుతారు. ప్యాకెట్ చిప్స్‌లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీరు చేరడానికి, అంటే.. కాళ్ల వాపులు, రక్తపోటు పెరగడానికి కారణం కావచ్చు. గర్భధారణ సమయంలో జీర్ణక్రియ ఇప్పటికే మందగిస్తుంది. ఇలాంటి డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ ఎక్కువవుతాయి. పొటాటో చిప్స్‌లో వీటిలో ఉండే కొవ్వులు బరువు వేగంగా పెరగడానికి దారితీస్తాయి, ఇది గర్భధారణ సమయంలో మంచిది కాదు.
గమనిక: చిప్స్ తినాలనిపిస్తే, ప్యాకెట్ చిప్స్‌కు బదులుగా ఇంట్లోనే తక్కువ నూనె, తక్కువ ఉప్పుతో చేసుకున్న బంగాళాదుంప ముక్కలు లేదా అరటికాయ చిప్స్ తినడానికి ప్రయత్నించండి. అలాగే చిప్స్ తిన్న తర్వాత కొంత సమయం ఆగి బాగా నీళ్లు తాగడం మర్చిపోకండి. ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం వైద్యులను సంప్రదించాలి.
