1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (13:57 IST)

నట్స్‌ను రోజూ ఇంతే తీసుకోవాలి.. 12 వేరుశెనగ పప్పులకు మించకూడదు..

నట్స్‌ల్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే నట్స్‌ను పరిమితంగా తీసుకోవాలి. మితిమీర కూడదు. నట్స్ పేరిట లభించే పిస్తా, వాల్‌నట్‌, బాదం, జీడిపప్పుల్లో.. విటమిన్లూ, ఖనిజలవణ

నట్స్‌ల్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే నట్స్‌ను పరిమితంగా తీసుకోవాలి. మితిమీర కూడదు. నట్స్ పేరిట లభించే పిస్తా, వాల్‌నట్‌, బాదం, జీడిపప్పుల్లో.. విటమిన్లూ, ఖనిజలవణాలు అధికంగా ఉంటాయి. రకరకాల సమస్యల్ని దూరం చేసే శక్తి వీటికి ఉంటుంది. మెదడుకూ  ఇవెంతో మేలుచేస్తాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గించే గుణం వాల్‌నట్లకు ఉంది.
 
గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు క్యాన్సర్ కారకాలను నశింపజేస్తాయి. కానీ నట్స్‌ను పరిమితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజుకు పది గ్రాములకు మించి తీసుకోకూడదు. అంటే కేవలం ఐదు వాల్‌నట్లు మాత్రమే తినాలి. అలానే వేరుసెనగపప్పు పన్నెండు, బాదం తొమ్మిది, జీడిపప్పు ఆరు మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజూ పప్పుల్ని ఇలా తీసుకోవడం వల్ల దాదాపు 23 రకాల రోగాలను శాశ్వతంగా దూరంగా ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.