1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. What foods should pregnant women eat, and what precautions should they take?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

Pregnant woman
గర్భవతులు సమతుల్యమైన పోషకాహారాన్ని తీసుకుంటుండాలి. తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఆకుకూరలు, కూరగాయలు ముఖ్యంగా తీసుకుంటుండాలి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి.
 
ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే... పప్పు ధాన్యాలు కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, సోయా వంటివి కణజాలం వృద్ధికి తోడ్పడతాయి. మాంసాహారులు గుడ్లు, చికెన్ తీసుకోవచ్చు. పాలు, పెరుగు, పనీర్ ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. ఇది బిడ్డ ఎముకల నిర్మాణానికి చాలా ముఖ్యం. తృణధాన్యాలైన జొన్నలు, రాగులు, సజ్జలు, బ్రౌన్ రైస్ వంటివి శరీరానికి అవసరమైన శక్తిని, పీచు పదార్థాన్ని(Fiber) అందిస్తాయి.
 
పండ్లు- డ్రై ఫ్రూట్స్... అరటిపండ్లు, దానిమ్మ, నారింజ వంటి తాజా పండ్లు విటమిన్లను అందిస్తాయి. బాదం, వాల్‌నట్స్, ఎండు ద్రాక్ష వంటివి అల్పాహారంగా తీసుకోవడం మంచిది. రోజువారీ ఆహార ప్రణాళిక ఎలా తీసుకోవాలంటే... ఉదయం(Breakfast)రాగి జావ లేదా కూరగాయలతో చేసిన ఉప్మా/ఇడ్లీ/దోశ. మధ్యాహ్నం అన్నం/జొన్న రొట్టె, ఒక కప్పు పప్పు, ఆకుకూర వంటకం, పెరుగు. సాయంత్రం (Snack) నానబెట్టిన బాదం పప్పులు లేదా తాజా పండ్ల ముక్కలు. రాత్రి (Dinner)తేలికపాటి ఆహారం (రొట్టెలు, కూరగాయలు) తీసుకోవడం ఉత్తమం.
 
జాగ్రత్తలు ఏమిటంటే... రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు త్రాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. నివారించాల్సినవి ఏమిటంటే.. బయట దొరికే జంక్ ఫుడ్, అతిగా టీ లేదా కాఫీ త్రాగడం, సగం ఉడికించిన మాంసం లేదా గుడ్లను తీసుకోకూడదు. పండ్లు, కూరగాయలను వాడే ముందు బాగా కడగాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?