1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. What happens if people with high blood pressure or diabetes consume chia seeds with water?

బీపీ, మధుమేహం వున్నవారు చియా సీడ్స్ నీటితో సేవిస్తే...?

Chia Seeds
చియా సీడ్స్. ఆరోగ్యానికి మేలు చేసే గింజలలో ఇవి కూడా ఒకటి. చియా సీడ్స్ కాస్తంత నీటిలో ఓ గంటపాటు నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగుతుంటే బీపీ, మధుమేహం వంటివి అదుపులో వుంటాయి. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.
బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి.
టైప్ 2 డయాబెటిస్‌ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి.
చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చియాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
చియా విత్తనాల్లోని మెగ్నీషియం కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి బీపిని అదుపులో వుంచుతుంది.
చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మనిషి త్వరగా అలసిపోడు.
చియా విత్తనాల్లో కాల్షియం, జింక్, విటమిన్ ఎ, ఫాస్పరస్ ఉన్నందున దంత వ్యాధులను అడ్డుకుంటాయి.
చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వున్నందువల్ల ఇవి తీసుకునేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.
గమనిక: చియా గింజలను నేరుగా తినకూడదు. వాటిని నీటిలో నానబెట్టుకుని సేవించాలి. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?