వామ్మో.. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ ... వైద్యులేమంటున్నారు...
సాధారణంగా రొమ్ము కేన్సర్ మహిళలో అధికంగా వస్తుంది. కానీ, ఇపుడు పురుషుల్లో కూడా ఈ వ్యాధిని వైద్యులు గుర్తించారు. హాలీవుడ్ నటుడు, మాజీ ప్రొఫెషనల్ రెజ్లర్ టైలర్ మేన్ తనకు రొమ్ము కేన్సర్ ఉందని వెల్లడించి, ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం తాను కీమోథెరఫీ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. పురుషుల్లోనూ రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదని తన ఉదంతం నిర్ధారణ అయిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదే అంశంపై ఆయన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేస్తూ, రొమ్ము కేన్సర్ ఉన్నట్టు తెలిసినపుడు మొదట దానిని రహస్యంగా ఉంచాలని అనిపించింది. కానీ పురుషుల్లో ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తున్నారని తెలుసుకున్నాను. అందుకే తన విషయాన్ని వెల్లడిస్తున్నాను. తనకు వచ్చిన గడ్డను తొలగించాలని భార్య ఒత్తిడి చేయకపోతే వ్యాధి మరింత ఆలస్యంగా బయటపడేదని ఆయన తెలిపారు.
సాధారణంగా రొమ్ము కేన్సర్ అంటే మహిళలకో వస్తుందనే భావన ఉంటుందన్నారు. కానీ, ఈ వ్యాధి పురుషుల్లో కూడా వచ్చే అవకాశం ఉందని తేలిందన్నారు. యూకేకు చెందిన కేన్సర్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక ప్రకరాం ఈ కేన్సర్ కేసుల్లో ఒక్క శాతం కంటే తక్కువ మాత్రమే పురుషుల్లో వచ్చే అవకాశం ఉందన్నారు. అయినప్పటికీ ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
ఈ వ్యాధికి సంబంధించిన విషయాలను గమనిస్తే, రొమ్ము భాగంలో గడ్డ లేదా వాపు ఉండటం. రొమ్ము కణజాలం మందంగా మారడం, చర్మం ఎర్రబడటం లేదా గుంటలు పడినట్టు కనిపించడం, చనుమొన నొప్పి లేదా సున్నితంగా మారడం, చనుమొన లోపలికి ముడుచుకునిపోవడం, చనుమొన నుంచి రక్తం లేదా ద్రవం కారడం, చంక కింద లింఫ్ నోడ్స్ వాపు వంటివి కనిపిస్తాయి.
Men get breast cancer too! I know I got it! Now its time to kick its ass! Come along for the journey. The good the bad and the ugly. pic.twitter.com/FGAocnZLOG
— TYLER MANE (@TYLER_MANE) June 9, 2026
తర్వాతి కథనం
