1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. Doctors at Medicover Hospitals Successfully Close Hole in 4-Year-Old-s Heart Without Surgery

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

Doctors with child patient
హైదరాబాద్: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ చికిత్స ద్వారా నాలుగేళ్ల చిన్నారి గుండెలో ఉన్న రంధ్రాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే విజయవంతంగా మూసివేసి అరుదైన ఘనత సాధించారు. మాస్టర్ వియాన్ పూజారి అనే నాలుగేళ్ల చిన్నారి, కేవలం 11 కిలోల బరువుతో తరచూ ఛాతీ ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం, బరువు పెరగకపోవడం వంటి సమస్యలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు సమగ్రంగా పరీక్షించగా, చిన్నారికి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ASD) అనే జన్యుపరమైన గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధిలో గుండె పైభాగంలోని రెండు గదుల మధ్య రంధ్రం ఏర్పడుతుంది.
 
చిన్నారి వయస్సు, తక్కువ బరువు దృష్ట్యా సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీకి బదులుగా వైద్యులు ట్రాన్స్‌క్యాథెటర్ ASD డివైస్ క్లోజర్ అనే అత్యాధునిక విధానాన్ని ఎంపిక చేశారు. కాలి రక్తనాళంలో సూదిపోటు పరిమాణంలో చిన్న రంధ్రం ద్వారా క్యాథెటర్‌ను గుండె వరకు చేర్చి, ప్రత్యేక డివైస్ సహాయంతో గుండెలోని రంధ్రాన్ని పూర్తిగా మూసివేశారు. ఈ ప్రక్రియలో ఛాతీ కోత, శస్త్రచికిత్స, రక్తస్రావం వంటి సమస్యలు లేకుండానే చికిత్స పూర్తి చేశారు.
 
ఈ సందర్భంగా పిల్లల గుండె వ్యాధుల నిపుణులు (పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్) డాక్టర్ అమోల్ గుప్తా మాట్లాడుతూ, ఇంత చిన్న వయస్సు, తక్కువ బరువు ఉన్న పిల్లల్లో ఇటువంటి క్యాథెటర్ ఆధారిత గుండె చికిత్సలు చేయడం అత్యంత నైపుణ్యం, ఖచ్చితత్వం అవసరమయ్యే ప్రక్రియ. చిన్నారి గుండెలోని రంధ్రాన్ని విజయవంతంగా మూసివేయగలిగాం. శస్త్రచికిత్స అవసరం లేకపోవడంతో చిన్నారి చాలా వేగంగా కోలుకున్నాడు. చికిత్స అనంతరం ఒక రోజులోనే సాధారణంగా కదలాడటం ప్రారంభించాడు అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ASD సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఊపిరితిత్తులు, గుండెపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పిల్లల్లో తరచూ ఇన్ఫెక్షన్లు, ఎదుగుదల లోపాలు, శారీరక బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ముందస్తు నిర్ధారణ, సమయానికి చికిత్స ఎంతో కీలకం అని వివరించారు. చికిత్స అనంతరం చిన్నారి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
ప్రస్తుతం పిల్లల్లో కనిపించే అనేక జన్యుపరమైన గుండె సమస్యలకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే అత్యాధునిక క్యాథెటర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్వరూప్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ డా. కిశోర్ పాల్గొన్నారు.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు