1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. Dr. Reddy-s Laboratories Announces Launch of Oral Semaglutide Biosimilar Obeda tablets in India

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

Tablets
హైదరాబాద్: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ దీని అనుబంధ సంస్థలతో కలిపి డాక్టర్ రెడ్డీస్‌గా వ్యవహరిస్తారు) టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే తన 'సెమాగ్లుటైడ్ బయోసిమిలర్' ను విడుదల చేసినట్లుగా నేడిక్కడ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెం దిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, భారతదేశంలో ‘ఒబెడా’ (Obeda) బ్రాండ్ పేరుతో టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రెడ్డీస్ ఇటీవల భారత్, కెనడాలలో విడుదల చేసిన జెనరిక్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ల సిరీస్ తర్వాత ఈ టాబ్లెట్ ఆవిష్కరణ జరిగింది. ఇది GLP-1 థెరపీలలో కంపెనీ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది.
 
ICMR-INDIAB అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోనే అత్యధికంగా డయాబెటిస్ బారిన పడిన దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. ఇక్కడ 101 మిలియన్లకు పైగా వయోజనులు ఈ వ్యాధితో జీవిస్తుండగా, దీని ప్రాబల్యం 11.4%గా ఉంది. ఆందోళనకరమైన విషయం ఏంటంటే, దాదాపు 136 మిలియన్ల మంది ప్రజలు ప్రి-డయాబెటిక్ (డయాబెటిస్ వచ్చే ముందు దశ) స్థితిలో ఉన్నారు, దాదాపు 40% మంది వయోజనులు పొత్తికడుపు ఊబ కాయం కలిగి ఉన్నారు, ఇది వారు భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదాన్ని పెంచు తుంది. అనేక చికిత్సా ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ, అదుపులో లేని టైప్ 2 డయాబెటిస్ అనేది ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయింది. గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1 రిసెప్టర్ అగోనిస్ట్ (GLP-1 RA) అయిన ఈ ఓరల్ సెమాగ్లుటైడ్, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వయోజనులలో గ్లైసెమిక్ నియంత్రణను(రక్తంలో చక్కెర స్థాయిలను) మెరుగుపరచడానికి సరైన ఆహారం, వ్యాయామంతో పాటు సహాయకారిగా సిఫార్సు చేయబడింది. ఇది రోగులకు అనుకూలమైన, సులభమైన ఎంపికను అందిస్తుంది, దీని వల్ల చికిత్సను ముందే ప్రారంభించడానికి వీలవుతుంది. అలాగే మందులను క్రమంతప్పకుండా వాడేలా ప్రోత్సహిస్తూ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది.
 
డాక్టర్ రెడ్డీస్ ఒబెడా(Obeda- సెమాగ్లుటైడ్ టాబ్లెట్లు) రికాంబినెంట్ DNA (rDNA) ఆధారిత సెమాగ్లుటైడ్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్(API)ని ఉపయోగించి తయారు చేయబడింది. భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న 288 మంది రోగులపై నిర్వహించిన ఫేజ్ III క్లినికల్ అధ్యయనం సమీక్ష తర్వాత, CDSCO (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నుండి డాక్టర్ రెడ్డీస్ తన ఓరల్ సెమాగ్లుటైడ్ బయో సిమిలర్‌కు ఆమోదం పొందింది. ఈ క్లినికల్ అధ్యయనంలో, ఒరిజినల్(ఇన్నోవేటర్) ఓరల్ డ్రగ్‌తో సమానమైన సమర్థత, సురక్షితమైన ప్రొఫైల్ ఉన్నట్లు రుజువైంది. 12 మరియు 24 వారాల వ్యవధిలో HbA1c స్థాయిని 7% కంటే తక్కువకు చేరుకున్న రోగుల నిష్పత్తిని లెక్కించగా... పరగడుపున, భోజనం తర్వాత ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలు, బరువు తగ్గడం, మొత్తం గ్లైసెమిక్ నియంత్రణలోనూ ఇన్నోవేటర్ డ్రగ్‌తో సమానమైన ఫలితాలు కనిపించాయి. అంతేకాకుండా, ఎలాంటి యాంటీ-డ్రగ్ యాంటీబాడీస్ గుర్తించబడలేదు. దీని ఇమ్యు నోజెనిసిటీ (రోగనిరోధక ప్రతిస్పందన) ప్రొఫైల్ కూడా ఇన్నోవేటర్ డ్రగ్‌తో సమానంగా ఉన్నట్లు తేలింది.
 
డాక్టర్ రెడ్డీస్ ఒబెడా(సెమాగ్లుటైడ్ టాబ్లెట్లు) 3 mg, 7 mg మరియు 14 mg డోసేజ్‌లలో అందుబాటులో ఉంది. దీనిని రోజుకు ఒకసారి నోటి ద్వారా తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. దీని ధరలు 3 mg టాబ్లెట్‌కు రూ. 99, 7 mg టాబ్లెట్‌కు రూ. 135 మరియు 14 mg టాబ్లెట్‌కు రూ. 225 గా నిర్ణయించబడ్డాయి.
 
డాక్టర్ రెడ్డీస్ గ్లోబల్ జెనరిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.వి. రమణ మాట్లాడుతూ, డయాబెటిస్(మధు మేహం) రోగుల కోసం మా ఓరల్ సెమాగ్లుటైడ్ (నోటి ద్వారా తీసుకునే టాబ్లెట్)ను విడుదల చేయడం అనేది, అత్యాధునిక డయాబెటిస్ సంరక్షణను అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడంలో మా ప్రయా ణానికి ఒక ముఖ్యమైన అడుగు. డయాబెటిస్‌తో ప్రతి రోగి ప్రయాణం భిన్నంగా ఉంటుందని, చికిత్స ఎంపికలు ఆ వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని మేం గుర్తిస్తున్నాము. ఈ ఆవిష్కరణతో, రోగులకు మరిన్ని ఎంపికలను, సౌలభ్యాన్ని అందించడానికి మేం మా GLP-1 పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నాం. ఈ ఉత్పత్తిని మా స్వంత ల్యాబ్‌లలోనే అభివృద్ధి చేసి, రూపకల్పన చేసినందున, భారతదేశంలోని రోగులకు నమ్మకమైన సరఫరాను, స్థిరమైన నాణ్యతను అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. మేం ఒక సమగ్రమైన GLP-1 పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తున్న తరుణంలో... ఆవిష్కరణలు, అత్యున్నత నాణ్యత, సరసమైన ధరలను అందించడంపైనే దృష్టి సారించాం. ఇది భారతదేశంలో, ఇతర దేశాలలో దీర్ఘకాలిక జీవక్రియ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు అర్ధవంతమైన చికిత్స ఎంపికలుగా, మెరుగైన దీర్ఘకాలిక ఫలితాలుగా మారుతుంది," అని అన్నారు.
 
డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెందిన ఒబెడా(Obeda- సెమాగ్లుటైడ్ టాబ్లెట్లు) అనేది వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే ఇచ్చే ఔషధం. మరిన్ని వివరాల కోసం రోగులు తమ వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచించడమైనది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
రోడ్డు పక్కన అమ్మే జ్యూస్‌లను తాగుతున్నారా? ఐస్‌తో జాగ్రత్త