1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. On World Cleft Awareness Day, Smile Train India Marks 800,000 plus Free Surgeries and a Renewed Push for Early Diagnosis of Clefts

క్లెఫ్ట్స్- గ్రహణం మొర్రి ముందస్తు నిర్ధారణ కోసం అవగాహనకు స్మైల్ ట్రైన్ ఇండియా కృషి

World Cleft Awareness Day
శస్త్రచికిత్స రంగంలో భారతదేశం ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లోని స్మైల్ ట్రైన్ ఇండియాకు చెందిన రెండు క్రియాశీల భాగస్వామ్య ఆసుపత్రుల నెట్‌వర్క్ 8,000కు పైగా ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఇది చికిత్స నుండి దృష్టిని మళ్ళించి, ముందస్తు నిర్ధారణ, అవగాహనపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.
 
ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి) అవగాహన దినోత్సవంగా(WCAD) జూలై 20న పాటిస్తున్నారు. క్లెఫ్ట్ లిప్(పెదవి చీలిక), ప్యాలెట్‌(అంగిలి చీలిక)ను ప్రధాన ప్రజారోగ్య చర్చలలోకి తీసుకురావడానికి, గ్రహణం మొర్రితో జన్మించిన ప్రతి బిడ్డకు సకాలంలో, సమగ్రమైన చికిత్స అందేలా చూడటానికి స్మైల్ ట్రైన్ 2025లో దీనిని పరిచయం చేసింది. ఈ సంవత్సరం, దేశంలో గ్రహణం మొర్రిపై ప్రధానంగా దృష్టి సారించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన స్మైల్ ట్రైన్ ఇండియా ఒక గర్వించదగిన మైలురాయిని చేరుకుంది. 2000 సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా పిల్లలకు 8 లక్షలకు పైగా ఉచిత గ్రహణం మొర్రి శస్త్రచికిత్సలకు మద్దతు ఇచ్చింది. ఈ విజయం ఆధారంగా, ఈ సంస్థ ఇప్పుడు తమ ప్రభావాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్తోంది. గ్రహణం మొర్రితో జన్మించిన ప్రతి బిడ్డను ముందుగానే గుర్తించి, వారు అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించేలా అవగాహన కల్పించడం లక్ష్యంగా చేసుకుంది. 
 
భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 35,000 మంది పిల్లలు గ్రహణం మొర్రితో జన్మిస్తున్నారు, అయినప్పటికీ అపోహలు, తప్పుడు సమాచారం మరియు వివక్ష కారణంగా చాలా మంది చికిత్స చేసేందుకు అనువైన కీలకమైన సమయాన్ని కోల్పోతున్నారు. ఆలస్యమైన చికిత్స వల్ల ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు, పోషకాహార లోపం, మాట, వినికిడి లోపాలు, దీర్ఘకాలిక సామాజిక, భావోద్వేగ సవాళ్లు ఎదురవుతాయి. మెరుగైన ఫలితాలు, సమగ్ర మైన రీతిలో వైద్య సేవలను పొందడానికి, ముందుగానే వ్యాధిని గుర్తించడం, సకాలంలో శస్త్రచికిత్స చేయడం చాలా కీలకం. ప్రపంచ గ్రహణం మొర్రి  అవగాహన దినోత్సవంను అవగాహన కల్పించడానికి, అపోహలను తొలగించడానికి, పెదవి చీలిక(గ్రహణం మొర్రి)తో జన్మించిన ప్రతి బిడ్డకు సకాలంలో చికిత్స అందేలా చూడటానికి ఉద్దేశించబడింది.
 
శస్త్రచికిత్సను ఒక పెద్ద ప్రణాళికలో ఒక భాగంగా స్మైల్ ట్రైన్ ఇండియా పరిగణిస్తుంది. దీని యొక్క సమగ్ర నమూనాలో పోషకాహార మద్దతు, స్పీచ్ థెరపీ,  ఆర్థోడాంటిక్ చికిత్స వంటివి ఉంటాయి. ఇవి పిల్లలు జీవితంలో సంపూర్ణంగా ఎదగడానికి సహాయపడతాయి. దీనికి ఆధారం సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చే వ్యూహం: స్మైల్ ట్రైన్ ఇండియా, స్థానికంగా మెరుగైన చికిత్స అందించడానికి స్థానిక సర్జన్లు, అనస్థీటిస్టులు, నర్సులు, మరియు బహుళ-విభాగాల క్లెఫ్ట్ బృందాలకు శిక్షణ ఇచ్చి, వారిని శక్తివంతం చేస్తుంది. భాగస్వామ్య ఆసుపత్రులను బలోపేతం చేయడం ద్వారా ఈ సంస్థ పిల్లలు తమ ఇంటికి దగ్గరలోనే నాణ్యమైన, ఉచిత క్లెఫ్ట్ సంరక్షణను పొందగలరని నిర్ధారిస్తుంది.
 
ఈ సంవత్సరం అవగాహన కార్యక్రమానికి విస్తృత మద్దతు లభించింది. భాగస్వాములు, దాతలు, రాయబారులు, శ్రేయోభిలాషులు, విస్తృత సమాజం, క్లెఫ్ట్ బాధితులు, వారి కుటుంబాలు WCAD (ప్రపంచ క్లెఫ్ట్ అవేర్నెస్ డే)ని పురస్కరించుకుని ఏకమయ్యారు. వీరిలో చాలామంది తమ గళాన్ని వినిపించడానికి , ఈ సంభాషణను వైద్య సమాజం దాటి సామాన్య ప్రజల ఇళ్ల వరకు విస్తరించడానికి సోషల్ మీడియా మరియు ఇతర వేదికలను ఉపయోగించుకున్నారు.
 
చికిత్స అందుబాటును విస్తరించడంలో మేము నిజమైన పురోగతిని సాధించాము, కానీ అవగాహన కల్పించడమే మాకు అత్యంత కఠినమైన సవాలుగా నిలిచిపోయింది," అని స్మైల్ ట్రైన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆసియా- రీజినల్ డైరెక్టర్, మమతా కారోల్ అన్నారు. "ప్రతిరోజూ, పిల్లలు రావలసిన సమయం కంటే నెలలు లేదా సంవత్సరాలు ఆలస్యంగా మా వద్దకు వస్తున్నారు. చికిత్స అందుబాటులో లేదని కాదు, పెదవి చీలికకు చికిత్స చేయవచ్చని వారి కుటుంబాలకు తెలియకపోవడం వల్ల లేదా దాని చుట్టూ ఉండే అపోహలను గురించి భయపడటం వల్ల అలా జరుగుతుంది. మనం ఆ అవగాహన అంతరాన్ని పూడ్చగలిగితే, ఈ పిల్లలను సకాలంలో చేరుకోగలం, ఒక్కరు కూడా నిరీక్షణలోనే ఉండకుండా చూసుకోగలం అని అన్నారు. 
 
ఈ ప్రపంచ గ్రహణం మొర్రి అవగాహన దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులు, సంరక్షకులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విధాన రూపకర్తలు, మీడియా మరియు సమాజాలను అవగాహన పెంచడంలో, ముందస్తు రోగ నిర్ధారణను ప్రోత్సహించడంలో మరియు పెదవి చీలికల చుట్టూ ఉన్న అపోహలను సవాలు చేయడంలో చురుకైన పాత్ర పోషించాలని స్మైల్ ట్రైన్ ఇండియా కోరుతోంది. ఉచిత గ్రహణం మొర్రి చికిత్స లేదా మరింత సమాచారం కోరుకునే కుటుంబాలు సహాయం కోసం స్మైల్ ట్రైన్ ఇండియా టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
జామ కాయలు ఆరోగ్య ప్రయోజనాలు