సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026
హైదరాబాద్: మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో మూవ్‌మెంటమ్ 2026 పేరుతో 25 వేలకుపైగా విజయవంతమైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. ఉదయ్ కృష్ణ మైనేని, హెచ్‌వోడి & చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ ఆధ్వర్యంలో చికిత్స పొందిన సుమారు 100 మంది రోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా ఫిట్‌నెస్ సెషన్‌లో రోగులు ఉత్సాహంగా పాల్గొని, శస్త్రచికిత్సల అనంతరం తిరిగి పొందిన ఆరోగ్యం, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు.
కార్యక్రమంలో వెల్‌నెస్, పునరావాసం, క్రమం తప్పని వ్యాయామం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. ఉదయ్ కృష్ణ మైనేని మాట్లాడుతూ, విజయవంతమైన శస్త్రచికిత్స కంటే రోగులు నొప్పిలేని, చురుకైన జీవితాన్ని తిరిగి పొందడం చూడటమే వైద్యుడికి నిజమైన సంతృప్తి. 25 వేలకుపైగా శస్త్రచికిత్సలు పూర్తి చేయడం రోగులు మాపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. అత్యాధునిక, రోగి కేంద్రిత ఆర్థోపెడిక్ సేవలను అందించేందుకు మెడికవర్ హాస్పిటల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోగులు తమ ఆరోగ్య పునరుద్ధరణ అనుభవాలను పంచుకుని వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డా. కె. సతీష్ కుమార్ (సీనియర్ కన్సల్టెంట్- జాయింట్ రీప్లేస్‌మెంట్, ఆర్థ్రోస్కోపిక్ & ట్రామా సర్జన్), డా. వినయ్ కందుకూరి (కన్సల్టెంట్- జాయింట్ రీప్లేస్‌మెంట్, ట్రామా & స్పోర్ట్స్ మెడిసిన్), డా. రవీష్ అజ్మీరా (కన్సల్టెంట్- ఆర్థోపెడిక్, ట్రామా & జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్), డా. అనుదీప్ పెద్దినేని (కన్సల్టెంట్- ఆర్థోపెడిక్ & స్పైన్ సర్జన్), డా. రాజు బి (కన్సల్టెంట్- ఆర్థోపెడిక్ సర్జన్), డా. శ్రీనివాస్ (హెచ్‌వోడి- అనస్థీషియా), శ్రీమతి కృష్ణవేణి (సెంటర్ హెడ్), డా. ప్రశాంత్ (మెడికల్ సూపరింటెండెంట్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీళ్ల ఆరోగ్యానికి ముందస్తు నిర్ధారణ, సకాలంలో చికిత్స, సరైన పునరావాసం, క్రమంతప్పని వ్యాయామం ఎంతో అవసరమని వారు సూచించారు.
