హైదరాబాద్: రివియా వాస్కులర్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో వెల్నెస్ బజార్... ఫ్లో-ది లాంజివిటీ డైలాగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 7, 2026న హైదరాబాద్‌లోని కోరమ్ క్లబ్‌లో జరిగిన ఈ సదస్సులో... దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులైన రక్త ప్రవాహం, రక్తనాళాల ఆరోగ్యం గురించి చర్చించడానికి ప్రముఖ వైద్యులు, నివారణ ఆరోగ్య నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు.
వృద్ధాప్యాన్ని కేవలం లక్షణాల ఆధారంగా చూసే సంప్రదాయ పద్ధతిని ఫ్లో సవాలు చేసింది. వ్యాధి బయటపడక ముందే, మెదడు పనితీరు, అవయవాల జీవశక్తి, చలనం, మెటబాలిక్ ఆరోగ్యం, మొత్తం జీవన నాణ్యతపై రక్త ప్రసరణ ప్రభావం ఎలా ఉంటుందో చర్చిస్తూ... దీర్ఘాయువును ఒక కొత్త కోణంలో ఆవిష్కరించింది. ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వెల్నెస్ బజార్ కో-ఫౌండర్ పూజా ఖాన్ సమన్వయకర్తగా, రివియా వాస్కులర్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు డాక్టర్ అర్జున్ రెడ్డితో జరిపిన ముఖాముఖి సంభాషణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రక్తనాళాల ఆరోగ్యాన్ని తరచుగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, ముందస్తు జోక్యం ఎందుకు ముఖ్యం అనే అంశాలపై వారు చర్చించారు.
రక్తనాళాల్లో మార్పులు లక్షణాలు కనిపించడానికి చాలా కాలం ముందే ప్రారంభమవుతాయి. ఇవి నిశ్శబ్దంగా అనేక అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇమేజ్-గైడెడ్ స్క్రీనింగ్ ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించి, చికిత్స చేయడం వల్ల మనం కేవలం ఆయుర్దాయాన్ని పొడిగించడం మాత్రమే కాదు, వారి చురుకైన జీవన కాలాన్ని కూడా మెరుగుపరచవచ్చు అని డాక్టర్ అర్జున్ రెడ్డి వివరించారు.
కవిత మంత ఆధ్వర్యంలో జరిగిన ప్యానెల్ చర్చలో.. సంభాషణ మెటబాలిక్, కార్డియాక్, రీజనరేటివ్ హెల్త్ వైపు మళ్లింది. నివారణ ద్వారా దీర్ఘాయువు పొందడానికి రక్త ప్రసరణే ఏకైక పునాది అని ఇది స్పష్టం చేసింది. డాక్టర్ అర్జున్ రెడ్డి మాట్లాడుతూ, గుండె జబ్బులు, డయాబెటిక్ కాంప్లికేషన్స్ నుండి ఫైబ్రాయిడ్స్, ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ వరకు అనేక పరిస్థితులు రక్తనాళాలతో ముడిపడి ఉంటాయి. వాస్కులర్-ఫస్ట్ (రక్తనాళాలకు ప్రాధాన్యతనిచ్చే), ఇమేజ్-గైడెడ్ విధానం సంక్లిష్టతలను నివారించడమే కాకుండా, శస్త్రచికిత్స అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అని అన్నారు.
PMX హెల్త్ కో-ఫౌండర్ డాక్టర్ సమత తుళ్ల మాట్లాడుతూ, క్లినికల్ లక్షణాలు కనిపించడానికి చాలా కాలం ముందే.. మెటబాలిక్ ఒత్తిడి, వాస్కులర్ (రక్త ప్రవాహ లోపం) పనిచేయకపోవడం అనేవి బయోమార్కర్లుగా కనిపిస్తాయి. ప్రెసిషన్ మెడిసిన్ ద్వారా ఈ సంకేతాలను ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. తద్వారా మనం చికిత్సను రియాక్టివ్ నుండి ప్రివెంటివ్ లాంజివిటీ(రాకముందే జాగ్రత్త పడటం) వైపు మార్చవచ్చు అని వివరించారు.
రీడిఫైన్ హెయిర్ వ్యవస్థాపకులు డాక్టర్ హరికిరణ్ చేకూరి మాట్లాడుతూ, పెప్టైడ్లు మరియు రీజనరేటివ్ థెరపీలపై జరుగుతున్న కొత్త పరిశోధనలు... వాస్కులర్ రిపేర్, ఎండోథీలియల్ హెల్త్ మరియు రికవరీ-కేంద్రీకృత చికిత్సలలో కొత్త అవకాశాలను తెరుస్తున్నాయి అని అన్నారు. కార్డియాలజిస్ట్ మరియు ప్రివెంటివ్ హార్ట్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ రాహుల్ కొంగర మాట్లాడుతూ, దీర్ఘకాలిక గుండె ఆరోగ్యానికి రక్త ప్రసరణే పునాది. గుండె జబ్బులు రావడానికి ముందు చాలా ఏళ్ల పాటు నిశ్శబ్దంగా రక్తనాళాల పనితీరు దెబ్బతింటుంది. అందుకే భవిష్యత్తులో గుండె ముప్పును తగ్గించడానికి ముందస్తు స్క్రీనింగ్, జీవనశైలి మార్పులు, నివారణ సంరక్షణ చాలా కీలకం అని పేర్కొన్నారు.
ముందస్తు సంరక్షణ, ప్రాథమిక అవగాహనపై ఉమ్మడి నొక్కివక్కాణింపుతో ఈ సెషన్ ముగిసింది. దీర్ఘాయువు అనేది వ్యాధి రావడానికి చాలా కాలం ముందే ప్రారంభమవుతుంది. ముందస్తు స్క్రీనింగ్, జీవనశైలి మార్పులు, ఇంటర్-డిసిప్లినరీ కేర్ ద్వారా రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల... వ్యక్తులు వృద్ధాప్యాన్ని ఎలా ఎదుర్కొంటారు, దీర్ఘకాలిక శ్రేయస్సును ఎలా పొందుతారు అనేదానిని పునర్నిర్వచించవచ్చు అని నిర్వాహకులు తెలిపారు. దీర్ఘాయువును రియాక్టివ్(వచ్చాక చూసుకోవడం)గా కాకుండా ప్రోయాక్టివ్(రాకముందే జాగ్రత్త పడటం)గా మార్చే... అవగాహనతో కూడిన నివారణ, ఆవిష్కరణల ఆధారిత సంరక్షణ నమూనాల ఆవశ్యకతను ఈ చర్చ బలపరిచింది.