సోమవారం, 16 మార్చి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 18 ఫిబ్రవరి 2026 (21:18 IST)

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

Respiratory issue
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
హైదరాబాద్: అంతర్జాతీయంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న, ఆవిష్కరణ-ఆధారిత లైఫ్-సైన్సెస్ కంపెనీ అయిన జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సరసమైన ఆసిలేటింగ్ పాజిటివ్ ఎక్స్‌పిరేటరీ ప్రెజర్(ఓపిఈపి) పరికరం, పిపెయిర్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది. సిఓపిడి, ఆస్తమా మరియు బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులలో ప్రభావవంతమైన రీతిలో శ్లేష్మ తొలగింపుకు మద్దతు ఇవ్వడానికి, ముక్కు దిబ్బడను తొలగించడానికి, శ్వాసను మెరుగుపరచడానికి రూపొందించబడిన 3-నిరోధక వ్యవస్థను ఇది కలిగి ఉంటుంది. పిపెయిర్  అనేది పేటెంట్ పొందిన డిజైన్‌తో కూడిన వినూత్నమైన, ఔషధ రహిత, హ్యాండ్‌హెల్డ్ పరికరం.
 
భారతదేశంలో 90 లక్షలకు పైగా రోగులు దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక శ్లేష్మ హైపర్‌స్క్రిప్షన్ అనేది ఈ రోగులలో ఒక సాధారణ సమస్య, రోజువారీ సంరక్షణ కోసం దీనికి ఎయిర్‌వే క్లియరెన్స్ పరిష్కారం అవసరం. ఏరోడెల్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం ప్రకారం పిపెయిర్ విడుదల చేయబడుతోంది. ఔషధ-డెలివరీ, పల్మనరీ రీహాబిలిటేషన్  ద్వారా ఉచ్ఛ్వాసాన్ని సరళీకృతం చేయడంపై దృష్టి సారించిన భారతీయ వైద్య పరికర సంస్థ , ఏరోడెల్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌. రోగి-కేంద్రీకృత విధానంలో, యూనిట్‌కు రూ. 990 సరసమైన ధరకు పిపెయిర్‌ను జైడస్ అందిస్తుంది.
 
ఈ ఆవిష్కరణ గురించి  జైడస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ మాట్లాడుతూ, జైడస్‌లో, రోగి-కేంద్రీకృత ఆవిష్కరణ అనేది రోగులకు రోజువారీ సంరక్షణను మరింత అందుబాటులోకి తెచ్చే విధంగా ఆరోగ్య సంరక్షణను ముందుకు తీసుకెళ్లడం. భారతదేశంలో మొట్టమొదటి సరసమైన ఓపిఈపి పరికరం పిపెయిర్‌తో, సిఓపిడి, ఉబ్బసం, బ్రోన్కియెక్టాసిస్ ఉన్న రోగులకు మెరుగైన శ్వాసను అందించడానికి రూపొందించబడిన ఔషధ రహిత, హ్యాండ్‌హెల్డ్ సొల్యూషన్‌ను మేము పరిచయం చేస్తున్నాము. ఈ ఆవిష్కరణ ద్వారా శ్వాసకోశ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడంలో మా ప్రయత్నాలను విస్తరించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని అన్నారు 
 
హ్యాండ్‌హెల్డ్, అపారదర్శక పరికరాన్ని ఉపయోగించి చేసే చికిత్స, ఓపిఈపి. ఇది శ్లేష్మం వదులు చేయటంతో పాటుగా వాయుమార్గాలు తెరిచి, ఉచ్ఛ్వాస సమయంలో ఒత్తిడి, కంపనాలను సృష్టిస్తుంది. పిపెయిర్ బలహీనమైన శ్లేష్మ మార్గాలను క్లియర్ చేయడానికి, వాయుమార్గ అడ్డంకిని తొలగించడానికి, దగ్గును తగ్గించడానికి, సరైన చికిత్సా ప్రతిస్పందనను అందించడానికి దోహదం చేస్తుంది. ఓపిఈపి ఆధారిత వాయుమార్గ క్లియరెన్స్‌ను క్లినికల్ మార్గదర్శకత్వంలో వినియోగించటం సిఫార్సు చేయబడింది, కానీ ఆచరణలో, దీని ధరలు  పెద్ద సంఖ్యలో రోగులకు చేరువ కాకుండా పరిమితం చేసింది; ఈ ధరల పరంగా స్తొమత అంతరాన్ని పిపెయిర్ పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
తీవ్రమైన, నిరంతర వాయు కాలుష్యం, అలెర్జీ కారకాలు, ఓజోన్‌లో వాతావరణ ఆధారిత మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల ఆరోగ్య సమస్యలను ఆలస్యంగా నిర్ధారించటం కారణంగా భారతదేశంలో శ్వాసకోశ వ్యాధులు తీవ్రంగా పెరుగుతున్నాయి.