వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము.
ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది.
గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
వేసవిలో డీహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా ఉండాలంటే నీరు, ప్లూయిడ్స్ బాగా తీసుకోవాలి. దాహం వేయటం, నోరు ఎండిపోవడం, ఆకలి లేకపోవడం, చర్మం ఎర్రబారటం, అలసిపోయినట్లు అనిపించడం వంటి లక్షణాలు గర్భిణులలో కనిపిస్తే వాళ్లు డీహైడ్రేషన్ బారీన పడే అవకాశం ఉందని గ్రహించాలి.