శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : సోమవారం, 4 జనవరి 2016 (12:35 IST)

కడుపునొప్పిని తగ్గించే యాలకులు...

ఒక గ్లాసు మజ్జిగలో ఒక టేబుల్‌ స్పూను కొత్తిమీర రసాన్ని కలిపి తాగితే అజీర్తి తగ్గి జీర్ణక్రియ మెరుగవుతుంది.
 
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను ఆపిల్‌ వెనిగర్‌ కలిపి భోజనం చేసిన తర్వాత తాగితే ఆరోగ్యానికి మంచిది. డయేరియాను నివారిస్తుంది.
 
ఏలకుల పొడిని నీటిలో కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
 
సోయాబీన్‌ను క్రమం తప్పుకుండా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
 
గొంతు బొంగురు పోతే బెల్లం, మిరియాలు కలిపి ఉండచేసి నోట్లో ఉంచుకుని మెల్లమెల్లగా రసాన్ని మింగితే తగ్గిపోతుంది.
 
తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది.