సంబంధిత వార్తలు
- ఏపీలో వర్షాలు, వడగాలులు తట్టుకోవాల్సిందే.. వాతావరణ శాఖ
- APSDMA: ఏపీలోని 28 మండలాల్లో వడగాలులు.. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి...
- APSDMA: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు.. 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు
- Heat Wave Alert : ఐదు రోజుల పాటు తెలంగాణలో వడగాలులు
- Heat Wave Forecast: ఏపీలో వేడిగాలులు.. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు..
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...
తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిందని చెబుతున్నారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వడగాలులు, ఉక్కపోతగా వుంటోంది. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తు నిర్వహణ చర్యలు ముమ్మరం చేసినట్లు రెండు తెలుగు ప్రభుత్వాధికారులు వెల్లడించారు. కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది.
ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ తీవ్రంగా వుంటుంది కనుక బైటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్పించి చిన్నారు, గర్భిణులు, వృద్ధులు బైటకు రాకూడదని తెలియజేస్తున్నారు.
అదేవిధంగా శరీరాన్ని హైడ్రేటుగా వుంచుకోవాలని చెబుతున్నారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తదితర ద్రవాలను సేవిస్తుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా వుండవచ్చు. ఒకవేళ ఎవరిలోనైనా నీరసం, కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి సలహా మేరకు చికిత్స అందించాలని చెబుతున్నారు.
తర్వాతి కథనం
