శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (21:37 IST)

షార్ట్ మెమెరీ లాస్... అది తీసుకుంటే ఔట్...

బిజీ లైఫ్‌ పని ఒత్తిళ్ళు కారణంగా మెదడు గతంలో ఉన్న విధంగా చురుకుదనాన్ని కనబరచలేకపోతోంది. దీంతో మరిచిపోవడం సాధారణమైపోయింది. ఫలితంగా అనారోగ్య సమస్యల్లో మతిమరుపు కూడా చేరిపోయింది. ముఖ్యంగా షార్ట్ టైం మెమరీ లాస్ ఎక్కువవుతోంది. ఒక గ్రాము పసుపుతో మతిమరుపుకు స్వస్తి పలుకవచ్చట. ఇదే పరిశోధనలో తేలింది.
 
ఒక గ్రాము పసుపుతో షార్ట్ టైం మెమరీ లాస్ నుంచి బయట పడవచ్చు. 60 యేళ్ళ పైబడిన వారిపై ఈ ప్రయోగం చేస్తే వారు బయటపడినట్లు పరిశోధనలో వెల్లడైందట. పసుపులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయన్నది తెలిసిందే. సాధారణంగా వాడే వంటల్లో తరచుగా పసుపును వాడితే సరిపోతుందట.
 
ఖర్జూర పండు ప్రయోజనం...
1. ఖర్జూరపండులో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది.
2. మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాపీగా అవుతుంది. మూత్ర సంబంధమైన ఇబ్బందులను తొలగిస్తుంది. 
3. మూత్రపిండాలలో రాళ్ళు కరగాలంటే ఖర్జూర పండు తరుచుగా తినాలి.
4. ఖర్జూరపండు తీసుకుంటే శరీరానికి నీరు పట్టడాన్ని నివారిస్తుంది.
5. బాలింతలు ఖర్జూర పండు తినడం వలన బాగా పాలుపడతాయి.
6. ఖర్జూర పండు తినడం వలన ఎముకలు బలంగా, పటుత్వంగా ఉంటాయి.