యుద్ధ క్షతగాత్రులకు హాస్యయోగ

FILE
ఇరాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడి.. ఆ తరువాత తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతుండే సైనికుల కోసం అమెరికన్ వైద్యులు.. "హాస్యయోగ" అనే ఓ దివ్యౌషధాన్ని కనుగొన్నారు.

వివరాల్లోకి వస్తే... అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో చికిత్స పొందుతున్న చాలామంది సైనికులు ఒకరకమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. వారి వ్యాధులను నయం చేయడం ఎవ్వరివల్లా సాధ్యం కాకపోవడంతో... వైద్యులందరూ ఆలోచనలో పడ్డారు. చివరికి అరిజోనా సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సంచాలకుడు డాక్టర్ ఆండీ వీల్ తన ప్రవాస భారతీయ సహచరుడితో కలిసి 'హాస్యయోగా'ను రోగులపై ప్రయోగించి సత్ఫలితాలను సాధించారు.

ఈ విషయమై ఆండీ వీల్ మాట్లాడుతూ... టక్సన్‌లో కార్డియోథొరాసిక్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ గుల్షన్ సేథీ, ఇటీవలే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఫెలోషిప్‌ను పూర్తి చేసుకున్న మరో వైద్యుడు, తానూ కలిసి... పై ఆసుపత్రిలోని క్షతగాత్ర సైనికులను మానసిక రుగ్మతల నుంచి బయటపడవేసేందుకుగానూ "హస్యయోగ" ప్రయోగించామని చెప్పారు.

Ganesh|
దీనివల్ల చాలా మంచి ఫలితాలు కనిపించాయని డాక్టర్ వీల్ స్వయంగా సెనేట్ ప్యానల్‌కు వెల్లడించారు. దీంతో.. సైనికుల మానసిక సమస్యలను పారద్రోలడంలో కీలకపాత్ర పోషించిన హాస్యయోగాకు తాను అభిమానిగా కూడా మారిపోయినట్లు ఆయన పేర్కొన్నాడు.


దీనిపై మరింత చదవండి :