ఆరోగ్యానికి సూర్యనమస్కారం ఎంతో మేలు చేస్తుంది. ఇది పలుయోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది. ఆసనం వేయు పద్ధతి...నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి.