ఇరాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడి.. ఆ తరువాత తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతుండే సైనికుల కోసం అమెరికన్ వైద్యులు.. హాస్యయోగ అనే ఓ దివ్యౌషధాన్ని కనుగొన్నారు. వివరాల్లోకి వస్తే... అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో చికిత్స పొందుతున్న చాలామంది సైనికులు ఒకరకమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. వారి వ్యాధులను నయం చేయడం ఎవ్వరివల్లా సాధ్యం కాకపోవడంతో... వైద్యులందరూ ఆలోచనలో పడ్డారు. చివరికి అరిజోనా సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సంచాలకుడు డాక్టర్ ఆండీ వీల్ తన ప్రవాస భారతీయ సహచరుడితో కలిసి 'హాస్యయోగా'ను రోగులపై ప్రయోగించి సత్ఫలితాలను సాధించారు.