పశ్చిమబెంగాల్‌లో "దోల్‌యాత్ర"గా హోలీ

WD
పశ్చిమబెంగాల్‌లో హోలీ పండుగను "దోల్ యాత్ర"గా జరుపుకుంటారు. హోలీ అంటేనే రంగులపండుగగా అభివర్ణిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలిరోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన "హోలికా" అనే రాక్షసి బొమ్మను నిప్పంటిస్తారు. రెండో రోజు ధులెండి ఉత్సవాన్ని రంగులు చల్లుకోవడం, రంగు నీళ్లను చల్లుకోవడం చేస్తూ ఘనంగా జరుపుకుంటారు. మూడో రోజున రంగపంచమీ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు.

ఇకపోతే.. ఉత్తర భారతదేశంలోని హిందువుల వసంతోత్సవ పండుగగా హోలీని పిలుస్తున్నారు. ఈ పండుగను దేశంలోనే కాకుండా నేపాల్‌లోనూ వెస్ట్ఇండీస్‌లోనూ ఘనంగా జరుపుకొంటారు.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
నీళ్ళలో రంగులు కలిపి చల్లుకోవడం, రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం ఈ రంగుల పండుగ విశేషం. మన రాష్ట్రంలో హోలీ పేరుతో ఎక్కువగా తెలంగాణాలోనూ, హైదరాబాద్‌లో కామునిపండుగ పేరుతోనూ, వసంతోత్సవం పేరుతో ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటున్నారు.


దీనిపై మరింత చదవండి :