రంగుల పండుగగా పేరొందిన హోలీ పండుగ సంబరాలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్, జంట నగరాల్లో భారీ ఎత్తున హోలీ సంబరాలను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా మతాలకు అతీతంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. బుధవారం తెల్లవారుజామునుంచే రంగుల పండుగ ప్రారంభమైంది. నాంపల్లి, బేగం పేట, కోఠీ వంటి ఇతర కాలనీ ప్రాంతాలన్నీ అనేక రకాలైన రంగులతో దర్శనమిచ్చాయి. ఈసారి సహజరంగులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి స్టాల్స్‌కు ఎక్కువ ఆదరణ లభించింది.