పూర్వం రఘుమహారాజు హోలిక అనే రాక్షసిని వధించిన రోజునే హోలి పండుగ చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథినాడు వచ్చే ఈ పండుగను భారతదేశ ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.