సంబంధిత వార్తలు
- తాతా.. నాకు చిప్స్ కొనిస్తావా? యోగి ఆదిత్యనాథ్‌ను కోరిన బుడతడు (వీడియో వైరల్)
- Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్
- Jennifer Lopez: అలవాట్లు, వ్యాయామంతో అందాన్ని కాపాడుకోవచ్చంటున్న జిమ్ మిర్రర్ సెల్ఫీలతో జెన్నిఫర్ లోపెజ్
- పాప్ ఐకన్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ చిత్రానికి కాసుల వర్షం, వారంలోనే రూ. 2 వేల కోట్లు
- అమెరికా వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఒకప్పటి హాలీవుడ్ స్టార్, ఏమైంది?
కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో
Miss Venezuela
ఇద్దరి మధ్య గొడవకు అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. దాడి అనంతరం 29 ఏళ్ల ఆండ్రియా డెల్ వాల్ తన ముఖానికి అయిన గాయాలను చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె ముఖం నుంచి రక్తం కారుతుండగా, తీవ్ర ఆవేదనతో కనిపించారు.
వీడియోలో ఆ హోటల్ గది మొత్తం చిందరవందరగా, ఫర్నిచర్ చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది. అదే సమయంలో స్టైలిస్ట్ లగునా గదిలోని ఒక మూలన కుర్చీలో కూర్చుని ఉండటం గమనార్హం.
హోటల్ గది నుంచి పెద్దగా అరుపులు, ఘర్షణ శబ్దాలు వినిపించడంతో ఇతర అతిథులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, 33 ఏళ్ల లగునాను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఆండ్రియాకు వైద్య చికిత్స అందించగా, ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిసింది.
#VIDEO // Estilista de certámenes Giovanni Laguna fue arrestado en Francia tras propinarle una brutal golpiza a la reina de belleza Andrea Del Val, Miss Venezuela Global 2024. ???????????? pic.twitter.com/t2KCvluZmB
— Grupo Marmor (@Marmor_Informa) May 21, 2026
