సంబంధిత వార్తలు
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ బయోపిక్.. రికార్డ్ బ్రేక్
- Warner Bros: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్
- కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో
- Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్
- Jennifer Lopez: అలవాట్లు, వ్యాయామంతో అందాన్ని కాపాడుకోవచ్చంటున్న జిమ్ మిర్రర్ సెల్ఫీలతో జెన్నిఫర్ లోపెజ్
Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
Spider-Man: Brand New Day
ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ ఇండియా హెడ్ షోనీ పంజికరన్ మాట్లాడుతూ... "భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో స్పైడర్-మ్యాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది, అందుకే ఈ చిత్రాన్ని అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతితో అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము" అని తెలిపారు.
అలాగే పీవీఆర్ ఐనాక్స్ రెవెన్యూ అండ్ ఆపరేషన్స్ సీఈవో గౌతమ్ దత్త మాట్లాడుతూ... "స్పైడర్-మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫ్రాంచైజీ. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై అభిమానులతో కలిసి వీక్షించడం మరపురాని అనుభూతిని అందిస్తుంది" అని అన్నారు.
డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్‌తో పాటు జెండయా, జేకబ్ బటలోన్, జాన్ బెర్న్తాల్, సాడీ సింక్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచం తనను మరచిపోయిన పరిస్థితుల్లో స్పైడర్-మ్యాన్‌గా నేరాలతో పోరాడుతున్న పీటర్ పార్కర్ జీవితంలో చోటుచేసుకునే కొత్త పరిణామాలు, అతను ఎదుర్కొనే రహస్యమైన శత్రువు చుట్టూ ఈ చిత్రం కథ సాగుతుంది.
"స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే" జూలై 30, 2026న 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టామ్ హాలండ్ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
