సాధారణంగా మన గుండె సవ్వడిని మనం గమనించము. అయితే మనం గమనించే విధంగా గుండె కొట్టుకోవడాన్ని గుండె దడగా భావించవచ్చు. ఇది సాధారణంగా పొగ త్రాగడం వల్ల, అధిక బరువు, గ్యాస్ట్రిక్ సమస్యలు, భయం, మానసిక ఒత్తిడి, శారీరక అలసట వల్ల, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల తలెత్తుంది. అదేవిధంగా గుండె సంబంధ వ్యాధులలోనూ ఇది కనిపిస్తుంది. హోమియోలో దీనిని నివారించుకటకు ఉపయోగపడే మందులను తెలుసుకుందాం