చెమటకాయల నివారణలో హోమియో

FILE
చెమటగ్రంథుల్లో తయారయ్యే చెమట బయటకు రావాలంటే స్వేదనాళాలు తెరచుకుని ఉండాలి. ఒకవేళ ఈ నాళాలు మూసుకుపోయినట్లయితే చెమట చర్మం ఉపరితలం మీదకు రాలేక, లోపలే ఉండిపోతుంది. దీంతో చిరాకు, చర్మమంతా చురుకుగా, మంటగా ఉండటం లాంటి సమస్యలు ఎదురవుతాయి.

చెమటకాయలు మొండెం, తొడల ప్రాంతంలో ఎక్కువగా వస్తుంటాయి. వీటి బారినుండి బయటపడాలంటే, ఎండ వేడిమి ప్రభావం శరీరానికి ఎక్కువగా తగలకుండా, సాధ్యమైనంతవరూ ఎండాకాలంలో చల్లటి ప్రదేశాలలో, నీడపట్టున ఉండటం మంచిది. ఈ జాగ్రత్తలను పాటించిన ఆ తరువాతనే వైద్య సహాయం తీసుకోవాలి. చెమటకాయల సమస్య నుండి దూరమయ్యేందుకు హోమియో వైద్యం చక్కగా పనిచేస్తుంది.

హోమియో మందులలో ముఖ్యమైనది "ఏపిస్"... సున్నితమైన చర్మం కలవారు, తాకితేనే బాధ, చురుకులు, మంటలు, కందిపోయినట్లు ఉండటం, దద్దుర్లు తదితర సమస్యలతో బాధపడేవారు ఈ మందును తీసుకోవచ్చు. ఇలాంటి చర్మం కలిగినవారు ఒంటిపైన చల్లటి నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంటుంది. చల్లటి గాలి కూడా వీరికి హాయినిస్తుంది.

"రస్టాక్స్"... ఈ మందు చర్మంపై నీటి బుగ్గల్లాగా వచ్చే దద్దుర్లతో బాధపడే రోగులు వాడవచ్చు. ఇలాంటి వారు ఈ మందు తీసుకోవడంతోపాటు వెచ్చటి నీటితో కాపడం పెట్టుకోవడం వల్ల కాస్తంత స్థిమితపడతారు.

"నేట్రంమోర్"... అసలు ఎండ అంటేనే గిట్టని వ్యక్తులకు ఇది పరమౌషధం అని చెప్పుకోవచ్చు. ఎండలోకి వెళితేనే తలనొప్పి, చర్మంపై దద్దుర్లు లేకపోయినా దురద, చురుకులు, చర్మం కందిపోయి దురద రావడం, నెత్తురు గడ్డలు కట్టడం లాంటి సమస్యలతో బాధపడేవారు ఈ మందును వాడవచ్చు.

Ganesh|
ఇదిలా ఉంటే... ఎండలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ "నేట్రంమోర్ 30ఎక్స్" వేసుకోవడం మంచిది. బీపీ ఉండేవారు ఎండలోకి వెళ్లేముందు "గ్లొనాయిన్ 30ఎక్స్" వాడాలి. వేసవిలో కూల్ డ్రింకులు ఎక్కువగా తాగి విరేచనాలు పట్టుకునేవారు "బ్రయోనియా" మందును వాడవచ్చు.


దీనిపై మరింత చదవండి :