భరించలేని నెలసరి నొప్పికి మెగ్నీసియా ఫాస్

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
WD
ఈ రోజు మనం బయోకెమిక్ మందు మెగ్నీసియా ఫాస్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మెగ్నీసియా ఫాస్ 6x క్రింద పేర్కొన్న సమస్యలకు బాగా పని చేస్తుంది. దీనిని కూడా 6x పొటెన్సీలో వాడవచ్చు.

1. తెరలు తెరలుగా వచ్చే కడుపు నొప్పికి మహిళలకు నెలసరిలో వచ్చే నొప్పికి 90 శాతం నొప్పి నివారిణిగా ఇది ఉపయోగపడుతుంది.
2. భరించలేని పంటి నొప్పికి దీనిని వాడటం వల్ల ఉపశమనం కులుగుతుంది
3. కండరాల నొప్పితో బాధపడేవారు ఈ మందును తీసుకుంటే సమస్య తొలగుతుంది
4. ఎక్కువ నడిచి తద్వారా కాళ్లు బాగా నొప్పి పెట్టినపుడు ఈ మందును వాడితే ఉపశమనం కలుగుతుంది
5. తల నొప్పికి మెగ్నీసియం ఫాస్‌ను వాడితే సమస్యనుంచి బయటపడవచ్చు.

ముఖ్యంగా నెలసరి బాధతో ఇబ్బందిపడే ప్రతి తమతో ఉంచుకోతగ్గ మంచి మందు మెగ్నీసియా ఫాస్. నెలసరి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి పావు గంటకు ఒకసారి నొప్పి తగ్గేవరకూ ఈ మందును వాడవచ్చు. ఇంకా వేధించే మొండి నొప్పికి అర కప్పు గోరు వెచ్చటి నీటిలో 4 మాత్రలు వేసి చెంచాతో బిళ్లలు కరిగేవరకూ ఒకే వైపుకు కలిపి ఆ మిశ్రమమును ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక చెంచా చొప్పున నొప్పి తగ్గేవరకూ వాడవచ్చు.

ఇది ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉంచుకోదగ్గ నొప్పి నివారిణి. ఇది పెయిన్ కిల్లర్ వలే పని చేస్తుంది. కొంతమంది హోమియో మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనుకుంటారు. కానీ ఈ మందు వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
- డాక్టర్ మాధురీ కృష్ణ


దీనిపై మరింత చదవండి :