హోమియో వైద్యానికి మంచి ఆదరణ

పుత్తా యర్రం రెడ్డి|
హోమియోపతి వైద్యానికి వ్యతిరేకంగా ఎన్నో విమర్శలు వస్తున్నా, దానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అల్లోపతి వైద్యం ఆకాశాన్నంటుతున్న ఈ రోజల్లో పేదవారికి హోమియోపతి వరంలా మారింది. దీనికి శాస్త్రీయత లేదని ఎప్పటి నుంచో వాదనలు వినిపిస్తున్నాయి. నాడి పట్టకుండా వేలాది రూపాయిలు ఫీజులుగా గుంజుతున్న డాక్టర్లున్న ఈ రోజుల్లో సగటు రోగికి హోమియో వైద్యం దివ్యమార్గంగా మారింది.

హోమియో వైద్యం రెండున్నర శతాబ్దాల కాలంగా ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కుని నిలబడుతోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. హోమియోపతీ వైద్యం, మందులు బాగా చౌకగా లభించడం ప్రముఖమైంది. అల్లోపతి, ఆయుర్వేదం మందులతో పోల్చి చూసినప్పుడు ఈ వైద్యం భారతదేశంలో చౌకే. కనుక పేదవారు ఆకర్షితులవుతున్నారు.

అల్లోపతి మందుల తరహాలోనే మంచి ఫలితాలను ఇస్తున్నాయి. హోమియో వైద్యం,మందుల వలన శాశ్వత, తాత్కాలిక ఫలితాలు లభిస్తున్నాయి. హోమియోపతీ మందులు వలన ఎటువంటి హాని లేదు. మందు మారినా ఫలితం దక్కదు. అంతేగాని ఎటువంటి సైడ్ ఎఫ్టెక్ట్స్ ఉండదు.

హోమియోపతి మందులు రసాయనాలు ఉండవు. ప్రకృతిలో దొరికే పదార్థాలు తయారు చేసినవే. హోమియో మందులు బయట లక్షణాలకి మూల హేతువు మీద పని చేస్తాయి. వచ్చిన జ్వరానికి కారణమైన హేతువులపా మందులు పని చేస్తాయి. లాభించే కారణాల వల్ల ఆదరణ పెరుగుతోంది.


దీనిపై మరింత చదవండి :