శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. »
  3. ఆరోగ్యం
  4. »
  5. హోమియోపతి
Written By Gulzar Ghouse

హోమియో వైద్యం...సంపూర్ణ రోగ నివారణం

హోమియో వైద్యం శాస్త్రీయ పద్ధతిలోనే జరగుతుందంటున్నారు హోమియో వైద్యులు. ఈ వైద్యం 200 సంవత్సరాల క్రితం నుంచే అమలులోకి వచ్చింది. ఈ వైద్యం "సమ: సమం, షమయతి" అనే పద్ధతి ద్వరానే జరుగుతుంది.

అంటే ముల్లును ముల్లుతోనే తీయాలి అనే పద్ధతి. ఏ రోగకారక క్రిమి జబ్బుకు కారణమౌతుందో, అదే క్రిమితోనే జబ్బును నయం చేయడం. అంటే జబ్బును కూకటివేళ్లతో పెకళించడం. ఈ వైద్య విధానంలో చాలామందికి అపోహలున్నాయి.

ఆ అపోహలు పోగట్టడానికి కొన్ని సలహాలు మీకోసం అంటున్నారు వైద్యనిపుణులు.

*1. ముందు రోగాన్ని తీవ్రతరంచేసి ఆ తర్వాత నయం చేస్తుంది ఈ హోమియోపతి వైద్యం అంటున్నారు కొంతమంది. మరి ఇది నిజమేనా...

**ఇది ప్రజల్లోవున్న అపోహ మాత్రమే. ఇలా కొన్ని ప్రత్యేకమైన కేసుల్లోనే జరుగుతుంది. తీసుకోవలసిన మాత్రల డోసుకన్నా కూడా ఎక్కువగా తీసుకోవడంవలన వ్యాధి లక్షణం తీవ్రమై ముదిరిపోతుంది. ఔషధాన్ని వైద్యుల సలహామేరకు తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

ఇంతే కాకుండా రోగి చాలా రోజుల వరకు మందులు తీసుకోవడం, వీటితోబాటు స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటుంటారు. కాని ఓ వైపు హోమియోపతి వైద్యం కొనసాగిస్తూనే స్టెరాయిడ్స్‌ను తీసుకోవడం ఆపేస్తారు. దాంతో వ్యాధి లక్షణాలు ముదిరిపోతుంది.


*2 కేవలం పాత లేక జీర్ణకోస సంబంధమైన వ్యాధులకు మాత్రమే హోమియోపతి వైద్యం ఉపయోగపడుతుందంటున్నారు. ఇది ఎంతవరకు నిజం.

** నిజమే. ఎందుకంటే చాలామంది రోగులు ఇతర వైద్యాలకు ప్రాముఖ్యతనిచ్చి వాటికి కూడా తగ్గక చివరికి హోమియోపతి వైద్యుల వద్దకు వైద్యంకోసం వస్తుంటారు. అప్పటికే ఆ జబ్బు బాగా ముదిరి పోయివుంటుంది. ఈ వైద్యం ద్వారా అన్ని రకాల జబ్బులను నయం చేయవచ్చు.

*3 హోమియోపతి వైద్యం చాలా నిదానంగా పనిచేస్తుందని అంటున్నారు.

** ఇది తప్పు. హోమియోపతి వైద్యం వెంటనే ప్రభావం చూపుతుంది. కాని ఇదివరకు వాడిన మందులు కావచ్చు, తీసుకున్న వైదం కావచ్చు. దాంతో వారి వ్యాధి ముదరవచ్చు లేక మార్పు లేకపోవచ్చు.

కాని ఇతర వైద్యానికి లొంగని జబ్బులున్నవారు కూడా చివరిగా హోమియోపతి వైద్యుల వద్దకు వచ్చిన సందర్భాలున్నాయి. సహజంగా ఇలాంటి రోగులకు వ్యాధి నయంకావడానికి కాస్త సమయంపడుతుంది.

*4 హోమియోపతి వైద్యంలో ఆహారనియమాలు ఎక్కువ.

** ఇదికూడా అపోహ మాత్రమే. హోమియోపతి వైద్యం కొనసాగేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంగువ, తమలపాకు, కాఫీ, పొగాకును వాడకూడదు. కొన్ని ఔషధాలను వాడేటప్పుడు మాత్రమే ఆహార నియమాలుంటాయి.ఈనియమాలను పాటించకపోతే వాడేమందు ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది.

*5 మధుమేహరోగులు హోమియోపతి వైద్యాన్ని పొందవచ్చా.

** మధుమేహరోగులు హోమియోపతి వైద్యాన్ని పొందవచ్చు, ఇందులో చక్కెర శాతం అతి తక్కువగావుంటుంది. ఇంకొక విషయమేంటంటే ఈ ఔషధాన్ని నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు.

*6 హోమియోపతి వైద్యం ద్వారా అన్నిరకాల జబ్బులను నయంచేయవచ్చా..

** ఇది ప్రతి ఒక్కరిలోవున్న అపోహ. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఇతర వైద్యాలలో వున్నట్టే ఆపరేషన్ (సర్జరీ) లాంటివి కూడా చేయవచ్చు. అన్ని రకాల జబ్బులకు ఈ హోమియోపతి ద్వారా వైద్యం పొందే అవకాశం ఉంది.
ముఖ్కంగా చెప్పాలంటే అతి తక్కువ ఖర్చుతోనే ఈ హోమియోపతి వైద్యం పొందవచ్చు.