ఇల్లు, ఆఫీసుకు సేఫ్టీ గ్లాస్‌తో హుందాతనం...

FileFILE
సొంత ఇంటికైనా, ఆఫీసు కైనా వన్నెతెచ్చే ఆధునిక అలంకరణ సామగ్రిలో అద్దాలకు ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, కార్పొరేట్ కార్యాలయాలు, స్టార్ హోటళ్లు, ఆత్యాధునిక షాపింగ్ మాళ్లు.. ఇలా ఎక్కడ చూసినా భవంతి బయటి ప్రాతంలో అద్దాల వాడకం సర్వసాధారణమై పోయింది.

అయితే ఇవి ఆషామాషీ అద్దాలు కావు మరి. అధిక ధర మన్నికతోపాటు బయట్నుంచి చూస్తే భవంతికే నూతన అందాలను కొని తెచ్చేంత అత్యధునాతన లక్షణం ఈ అద్దాలకు ఉంది. అందుకే సాధారణ అద్దాల కంటే వీటికి వంద శాతం అధికంగా ధర పలుకుతున్నా కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆధునిక అద్దాల గురించి తెలుసుకుందాం...

ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల అద్దాలు అంటే సేఫ్టీ గ్లాస్‌లు లభిస్తున్నాయి. ఇవి టెంపర్డ్ మరియు లామినేటెడ్ అద్దాలుగా పేరు పొందాయి. సాధారణ గ్లాస్ ధర చదరపు అడుగుకు రు.300లు అవుతుందనుకుంటే సేఫ్టీ గ్లాస్ ధర దాదాపు రూ.600లు పలుకుతుంది.

ఇంట్లో కానీ కార్యాలయాల్లో కాని అరలు అరలుగా చేయాల్సి వస్తే టెంపర్డ్ గ్లాస్‌ని వాడొచ్చు. అదే పెద్ద పెద్ద భవనాలకయితే ల్యామినేటెడ్‌వి చక్కగా నప్పుతాయి. దృఢత్వంలో వీటికి సాటిలేదు కాబట్టే ఈ రెండు రకాల పాలిష్ట్ అద్దాలు అధిక ధర పలుకుతున్నప్పటికీ గిరాకీ రానురానూ పెరుగుతోంది.

సాధారణ అద్దాల కంటే ఐదు రెట్లు మన్నికతో బలంగా ఉండే ఈ సరికొత్త అద్దాలు పగిలిపోవని చెప్పలేం కాని, ప్రాణహాని కలిగించకుండా ఉంటాయి. ఈ సేఫ్టీ గ్లాస్ పటిష్టతను డిగ్రీల రూపంలో నిర్ణయిస్తారు. ఈ మేరకు గ్లాస్ మీద కోడ్ నెంబర్లను ముద్రిస్తారు.

గ్లాస్ మందం ఎంత ఏరియాకు సరిపోతుందన్న వివరాలు కంపెనీలే అందచేస్తాయి. సరైన స్థానంలో సరైన మందం ఉన్న టెంపర్డ్ లేదా ల్యామినేటెడ్ అద్దాలను వాడితేనే ప్రయోజనం ఉంటుందని డిజైనర్ల ఉవాచ. అయితే ఒకటి మాత్రం నిజం. పక్కా ఇళ్లకు, కార్పొరేట్ భవనాలకు హుంగుతో పాటు హుందాతనాన్ని కూడా తేవడంలో ఈ సేఫ్టీ గ్లాస్‌లకు మించినవి లేవు.

Raju|
ఇల్లు లేదా ఆఫీసు కట్టాలనుకుంటే ఈ సరికొత్త తరహా గ్లాస్‌లను అమర్చడానికి సందేహపడకండి.


దీనిపై మరింత చదవండి :