ఆఫ్గన్-పాక్‌పై రేపు చర్చించనున్న ఒబామా

Gulzar Ghouse|
ఆఫ్గనిస్థాన్-పాకిస్థాన్ దేశాల గురించి నిర్ణయించుకునేందుకుగాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తమ భద్రతా సిబ్బందితో బుధవారం సిచ్యుయేషన్ రూంలో చర్చలు జరపనున్నారు.

ఒబామా ఈ వారాంతంలో ఆసియా పర్యటన నిమిత్తం బయలు దేరి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్-పాక్ దేశాల పరిస్థితిపై చర్చించనున్నారని వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.

గురువారం నాడు ఒబామా ఆసియా పర్యటన నిమిత్తం బయలు దేరివెళుతున్నారని, ఈ సందర్భంగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బుధవారం జరిగే సమావేశం ఇదివరకటి సమావేశాల మాదిరిగానే జరుగుతుందని, ఇందులో ప్రత్యేకత ఏదీ లేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో దౌత్యాధికారులు, భద్రతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.


దీనిపై మరింత చదవండి :