ఆస్ట్రేలియాలో తీవ్రవాద కుట్ర: మరిన్ని అరెస్ట్‌లు

Phani|
ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు జరిగిన కుట్రకు సంబంధించి అధికారిక యంత్రాంగం మరో ముగ్గురు తీవ్రవాద అనుమానితులను అరెస్టు చేసింది. ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు తీవ్రవాదులు పన్నిన కుట్రను ఆస్ట్రేలియా భద్రతా యంత్రాంగం భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

ఈ కుట్రకు సంబంధించి మంగళవారం నలుగురు అనుమానితులను అధికారులు అరెస్టు చేశారు. తాజాగా మరో ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సోమాలియాకు చెందిన షెబాబ్ అనే తీవ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు అధికారిక యంత్రాంగం గుర్తించింది.


దీనిపై మరింత చదవండి :