కెనడాలో ఎన్ఆర్ఐ పిల్లల హత్య

Gulzar Ghouse|
కెనడాలో భారత సంతతికి చెందిన ఇద్దరు పిల్లలను దుండుగులు తొలుత అపహరించి ఆ తర్వాత శుక్రవారం రాత్రి తుపాకులతో కాల్చి చంపారు.

భారత సంతతికి చెందిన జోసెఫ్ రాణడే, దిల్‌షేర్ గిల్ మృతదేహాలను వైంకువర్ సమీపంలో ఓ కారునుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిరువురి వయసు 18 సంవత్సరాలని ఇద్దరూకూడా కెనడాలోని డబ్ల్యూ జే మౌంట్ సెకండరీ పాఠశాలలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తన పుత్రుడిని అలాగే అతని మిత్రుడైన గిల్‌ను కిడ్నాప్ చేసి చివరికి గ్రామీణ ప్రాంతంలోని ఓ మారుమూల ప్రాంతంలో కారులో శవాలను వదిలి వెళ్ళారని జోసెఫ్ తండ్రి అమర్‌జీత్ రాణడే తెలిపారు.

ఇదిలావుండగా ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని స్థానిక మీడియా కథనం. కాగా ఈ మిస్టరీని ఛేదించగలమని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.


దీనిపై మరింత చదవండి :