చందమామపై నీటి గుట్టు రట్టు చేసేందుకు నాసా రాకెట్ "ఢీ"

Gulzar Ghouse|
రావే...జాబిల్లి రావే...కొండెక్కి రావే....అని పాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు అదే చల్లటి వెన్నలనిచ్చే చందమామపై పరిశోధనలపేరుతో దాడులు జరుగుతున్నాయి. జాబిల్లిపై నీరుందని తెలిపిన ఇస్రో శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు అమెరికా ఖగోళశాస్త్రజ్ఞులు శుక్రవారం ఓ రాకెట్టును చంద్రుడిని ఢీకొట్టేందుకు పంపించారు. ఇది చంద్రుడిని ఢీ కొట్టింది. దీంతో దుమ్ము, ధూళి పెద్ద ఎత్తున ఎగిసిపడింది.

అక్కడ నీరున్న ఆనవాళ్లు తెలిసినప్పటినుంచి వాటి లోతుపాతులు తెలుసుకోవాలన్న జిజ్ఞాస అంతరిక్ష శాస్త్రవేత్తలను వేధిస్తూనే ఉంది. ఆ గుట్టు తెలుసుకునేందుకుగాను అమెరికాలోని అంతరిక్ష పరిశోధనాకేంద్రం నాసా ఈరోజు ఒక రాకెట్‌ని ప్రయోగించింది.

నాసా ప్రయోగించిన రాకెట్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఢీకొట్టిందని, దాంతో చందమామపై దుమ్ము, ధూళి భారీగా ఎగసిపడ్డాయని తెలుస్తోంది. చంద్రునిపై నీటిజాడల విషయమై సాగుతున్న పరిశోధనల్లో అత్యంత ఖర్చుతో కూడిన ప్రయోగంగా ఇది రికార్డు సృష్టించింది.

ఈ రాకెట్ ఢీ కొట్టిన సమయంలో అక్కడి చిత్రాలు అంతరిక్ష కేంద్రానికి అందుతాయి. వాటిని పరిశీలిస్తే చందమామ నీటి గుట్టు రట్టయిపోతుంది. అందుకు మరి కొన్ని గంటలు చాలని ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.


దీనిపై మరింత చదవండి :