చైనాలో భూకంపం: పదిమంది మృతి

Gulzar Ghouse|
చైనాలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. చైనాదేశానికి నైరుతి భాగంలో ఈ భూకంపం సంభవించింది. ఇందులో దాదాపు పదిమంది మృతి చెందగా మరో 300కు పైగా తీవ్ర గాయాలపాలైనట్లు సమచారం.

భూకంపం సంభవించినప్పుడు పదివేలకుపైగా ఇళ్ళు, ముఫైవేలకు పైగా భవంతులు కుప్పకూలాయి. భూకంపం జరిగిన ప్రాంతం యున్నాన్ ప్రాంత రాజధాని కున్‌మింగ్ నుంచి దాదాపు 200కిలోమీటర్ల దూరంలో క్వాంతుమ్‌లో జరిగినట్లు అధికారులు వివరించారు.

అమెరికా భూగర్భ సర్వేననుసరించి చైనాలో జరిగిన భూకంపం అంతర్జాతీయ సమయానుసారం గురువారం సాయంత్రం ఏడు గంటల 19 నిమిషాలకు జరిగినట్లు సమాచారం.

ఇదిలావుండగా భూకంపం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు, సిబ్బంది కథనం మేరకు యున్నాన్ ప్రాంతానికి 98కిలోమీటర్ల ఈశాన్యం ప్రాంతంవైపు 54 కిలోమీటర్ల లోతువరకు సంభవించిందని, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని అధికారులు తెలిపారు.

కాగా భూకంపం కారణంగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. జాతీయ రహదారులతోసహా పలు రహదారులు వందల కిలోమీటర్ల మేరకు కోతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఆదేశ నాయకులు, అధికార వర్గాలు వెల్లడించాయి.


దీనిపై మరింత చదవండి :