తాలిబన్లకన్నా అతి క్రూరమైనది అల్‌ఖైదా

Gulzar Ghouse|
తమ దేశానికి తాలిబన్లకన్నా అల్‌ఖైదాతోనే అత్యంత ప్రమాదం పొంచి ఉందని అమెరికా భావిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా జీహాద్ కార్యక్రమాన్ని రూపొందించి అమెరికాను సర్వనాశనం చేసేందుకు అల్‌‍ఖైదా సిద్ధంగా ఉందని, ఇది తాలిబన్ తీవ్రవాద సంస్థకన్నా అత్యంత క్రూరమైనదని వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు. అదే తాలిబన్ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకన్నా మేలని ఆయన అన్నారు.

ఇదిలావుండగా తాలిబన్లను ఆఫ్గనిస్థాన్‌నుంచి వేరుచేయలేమని, అక్కడ భీకర యుద్ధవాతావరణం కొనసాగినా కూడా తాలిబన్లు ఆఫ్గనిస్థాన్‌ను వీడి వెళ్ళే ప్రసక్తి లేదని ఒబామా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు వాషింగ్‌టన్ పోస్ట్ వార్తాసంస్థ తెలిపింది.

కాగా అక్కడ తాలిబన్ తీవ్రవాదులు ఎంతమంది మృతి చెందినా కూడా వారు మరింతగా ఎగబడుతున్నారని వార్తా సంస్థ తెలిపింది.


దీనిపై మరింత చదవండి :