పాక్‌లో డ్రోన్ దాడులు: నలుగురి మృతి

Gulzar Ghouse|
పాక్‌లోని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికాకు చెందిన డ్రోన్ విమానం దాడులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనాయి.

ఉత్తర వజీరిస్థాన్ ఏజెన్సీ(ఎన్‍‌డబ్ల్యూఏ)లో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మీర్ అలీకి చెందిన నోరోక్ తహసీల్‌పై అనుమానాస్పదమైన అమెరికా డ్రోన్ విమానం దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ వార్తా సంస్థ "జియో న్యూస్" ఛానెల్ తెలిపింది.

అమెరికాకు చెందిన డ్రోన్ విమానం దాడులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఇందులో మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదని జియో సంస్థ పేర్కొంది.

ఇదిలావుండగా పాకిస్థాన్ ప్రభుత్వం తన సైనిక బలగాలతో దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలోని కబాయలీ క్షేత్రంలో స్థావరాలను ఏర్పరచుకునివున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు గత నెల 17 నుంచి ఆపరేషన్ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 400 మంది ఉగ్రవాదులు మృతి చెందారని, వీరితోపాటు మరో 37 మంది సైనికులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.


దీనిపై మరింత చదవండి :