మైఖేల్‌ జాక్సన్‌తో ఓ రహస్య స్నేహితురాలు

DBMG
అమెరికాకు చెందిన పాప్ సంగీతజ్ఞుడు మైఖేల్ జాక్సన్ చివరి క్షణాలలో అతనితో ఓ మహిళకూడా ఉందట. ఈ విషయం చాలామందికి తెలీదు.

మైఖేల్ జాక్సన్ చివరి క్షణాలలో ఓ మహిళకూడా ఉందని మాజీ అంగరక్షకుడు మైట్ ఫిడేస్ స్పష్టం చేశారు. ఈమె చాలాకాలంపాటు మైఖేల్‌తో కలిసి ఉంటోందని ఆయన తెలిపారు.

ఆ మహిళ గొప్ప సెలిబ్రిటీ ఏమీ కాదు, కాని మైఖేల్ జాక్సన్ కుటుంబ సభ్యులందరికీ ఆమె చిరపరిచితురాలని ఫిడేస్ బ్రిటీష్ ఛానెల్ స్కై న్యూస్‌కు సమాచారం అందించినట్లు ఆ ఛానెల్ పేర్కొంది.

ఇదిలావుండగా మైఖేల్ జాక్సన్ తొలినుంచి మాదక ద్రవ్యాలు తీసుకుంటుండేవారని, అతను ఏయే మాదక ద్రవ్యాలు తీసుకునేవాడో తనకు తెలుసునని ఫిడేస్‌ తెలిపాడు.

మాదక ద్రవ్యాలు అలవాటును మానుకోమని తను మైఖేల్ జాక్సన్‌కు చాలాసార్లు విన్నవించానని, కాని అతను తన అలవాట్లను మాత్రం మానుకోలేదనీ, పైగా తనపై కోప్పడేవాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Gulzar Ghouse|
కాగా వైద్యులుకూడా అతనికి పలుమార్లు మాదకద్రవ్యాలను త్యజించమని సూచించారని, కాని వారిమాటలను జాక్సన్ పెడచెవిన పెట్టారని ఆయన పేర్కొన్నారు.


దీనిపై మరింత చదవండి :