లండన్‌లో భారతీయుడిని హత్య చేసిన దుండగులు

PNR| Last Modified ఆదివారం, 10 జనవరి 2010 (16:40 IST)
లండన్‌లో ఒక భారతీయ సంతతికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఇద్దరు దుండగులు చేశారు. ఒక మహిళ వద్ద దోపిడీకి పాల్పడిన ఈ ఇద్దరు దుండగులను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఈ హత్య జరిగింది.

ఈస్ట్ లండన్‌లో నివశిస్తున్న సుఖ్వీందర్ సింగ్ అనే భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే, 28 సంవత్సరాల ఒక మహిళ వద్ద ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. దీంతో ఆమె మహిళ కేకలు వేసింది.

ఆ సమయంలో అటుగా వెళుతున్న సుఖ్వీందర్ సింగ్‌ దుండగులను పట్టుకున్నాడు. దీంతో వారి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. ఆ సమయంలో ఒక దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో సుఖ్వీందర్‌ను పొడిచాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.


దీనిపై మరింత చదవండి :